3,820 మంది సురక్షితంగా తరలింపు
దుబాయ్: మెరీనాలోని 67 అంతస్తుల మెరీనా పినాకిల్‌లో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో అత్యవసర సిబ్బంది స్పందించి 764 అపార్ట్‌మెంట్ల నుండి 3,820 మంది నివాసితులను సురక్షితంగా తరలించారు, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆరు గంటల తర్వాత దుబాయ్ సివిల్ డిఫెన్స్ మంటలను నియంత్రించగలిగింది. టైగర్ టవర్ అని కూడా పిలుచుకునే మెరీనా పినాకిల్‌ను ముంచెత్తిన ఈ మంటల్లో ఎవరూ గాయపడటం కానీ, ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు. ఖలీజ్ టైమ్స్ ప్రకారం దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఆరు గంటలు అవిశ్రాంతంగా పనిచేశాయి. ప్రత్యేకమైన అగ్నిమాపక, రెస్క్యూ యూనిట్లు ఆ హై రైడ్‌లోని 764 అపార్ట్‌మెంట్ల నుండి 3,820 మంది నివాసితులను విజయవంతంగా ఖాళీ చేయించినట్లు దుబాయ్ మీడియా ఆఫీస్ తెలిపింది.