మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఘటన
భోపాల్, జూన్ 14: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో శనివారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడిరచారు. బాలాఘాట్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం నిఘా వర్గాల నుంచి పోలీసులు, భద్రతా దళాలకు అందడంతో వారు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన మావోయిస్టులు వారిపైకి కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు వెంటనే ఎదురు కాల్పులు జరిపాయి.
మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు నిరంతరాయంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఆ క్రమంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో వందలమంది మావోయిస్టులు మృతిచెందారు. వారిలో అగ్రనేతలు సైతం ఉన్నారు. అయితే ఈ కూబింగ్‌ను తట్టుకోలేక కొందరు మావోయిస్టులు సరిహద్దు రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల్లోకి ప్రవేశించారంటూ నిఘా వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా జిల్లాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.