చెడు విషయంలోనూ మానవీయ కోణమేనా?
సినిమాల్లో నెగిటివిటీని తగ్గించాల్సిందే!
సినిమాల వల్ల సమాజానికి ఏం ఉపయోగం..?
సమాజానికి జరుగుతున్న నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు?
నేరాలు చేయడాన్ని హీరోయిజంగా చూపించడం ముమ్మా టికీ తప్పే...
సినిమాల ప్రభావంతో నేరాలు పెరగడం.. గ్యాంగ్‌స్టర్ అనిపించుకునేందుకు యువకులు బహిరంగంగా హత్యలు చేయడం.. మారణాయుధాలతో వీడియోలు పోస్టు చేస్తున్న ఘటనలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. నేరాన్ని ప్రోత్సహించినా.. నేరమే! భారత రాజ్యాంగం ప్రకారం, నేరం చేయడమే కాదు.. నేరాన్ని ప్రోత్సహించినా నేరంగానే పరిగణిస్తారు. ఆ కోణంలో చూస్తే సినిమాల్లో నేరాలు చేయడాన్ని హీరోయిజంగా చూపించడం ముమ్మా టికీ తప్పే. అలాంటి సినిమాలపై నిషేధం విధించడం చట్టపరిధిలో లేకపోతే.. కనీసం అధిక పన్నులు విధించడం ద్వారా సమాజానికి కొంత్కెనా మేలు చేయవచ్చు. వినోదరంగంలో ప్రధానమైనది సినిమా. వీటి ప్రభావం సమాజంపై ఎక్కువగా పడుతుంది. ఒకప్పుడు ఇంటిల్లిపాదినీ ఆకట్టుకునే సినిమాలు వొచ్చేవి. కానీ ఇప్పుడు అలాంటి ఫ్యామిలీ సినిమాలు ఏడాదికి ఎన్నివస్తున్నాయి. ఇప్పుడు సినిమాల్లో కథలు ఎలా ఉంటున్నాయి? ఆ మధ్య వొచ్చిన ‘బిజినెస్ మ్యాన్’ అనే సినిమాలో హీరో మాఫియాను ఓ వ్యాపారంలా మార్చి దేశ రాజకీయాలనే మార్చాలని చూస్తాడు. ఇందుకు గూండాయిజాన్ని వైట్ కాలర్ జాబ్‌లా కలరింగ్ ఇస్తాడు. ఇక ‘సలార్’ అనే సినిమాలో హీరో ముద్ర ఉన్న లారీలను ఆపేందుకు కస్టమ్స్ ఆఫీసర్లు, పోలీసులు వణికిపోతారు. ‘కేజీఎఫ్’లో హీరో కేందప్రభుత్వాన్నే గడగడలాడిస్తాడు. నేరం చేయడం లోనూ స్టైల్ ఉంటుందని యువతలో క్రేజ్ నింపుతాడు. ‘పుష్ప’ సినిమాల్లో ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ చేయాలో కొత్త వాళ్లకు క్లాసులు చెప్పినట్టుగానే ఉంటుంది. కొత్తగా వస్తున్న డ్రిరకర్ సాయి అనే సినిమా ట్యాగ్ ల్కెన్.. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్. ఇందులో బూతులు మాట్లాడటం.. ఎప్పుడూ తాగుతూ ఉండటం.. అమ్మాయిల వెంటపడటమే యువకుల లక్షణం అన్నట్టుగా చూపించారు. అంతిమంగా అన్ని సినిమాల్లోనూ కష్టపడకుండానే డబ్బు గుట్టలుగా వచ్చి విరీద పడిపోవాలి..
హీరో అనుకున్న అమ్మాయి అతడికి దక్కాలి. అందుకు ఏం చేయడానికైనా వెనుకాడొద్దు అన్న ఒకే ఒక సిద్దాంతం కనిపిస్తుంది. మరి ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి ఏం ఉపయోగం..? సినిమా లతో సమాజంలో పాజివిటివీని పెంచకపోయినా ఫర్వాలేదు కానీ, నెగిటివిటీని పెంచుతుండటమే ప్రస్తుతం వచ్చిన సమస్య. పన్నులు పెంచితే తప్పేమి..? సినిమా అంటే వ్యాపారం అవును.. అది ఎవరూ కాదనలేని సత్యం. సినిమాలు తీసేందుకు కోట్లలో ఖర్చు అవుతుంది. దానిని రాబట్టుకు నేందుకు ఎన్నోరకాల మ్యాజిక్కులు చేయాల్సి ఉంటుంది. అందు కని నరుక్కోవడాలు.. చంపుకోవ డాలతో హింసను మాత్రమే హైల్కెట్ చేయడం వల్ల సమాజానికి జరుగుతున్న నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కొంతమంది సినిమా పెద్దలు, ముఖ్యంగా మూవీ ఫిలాసఫర్ రామ్ గోపాల్ వర్మ అనేక మాధ్యమాల్లో మాట్లాడుతూ ’సినిమా నచ్చితే చూడండి.. లేకపోతే మానేయండి. అంతేకానీ, ఇలా తీయవద్దు.. అలా తీయవద్దు. అని చెప్పే అధికారం ఎవరికీ లేదు. సినిమా అనేది నిర్మాత, దర్శకుడు తయారు చేసిన ప్రొడక్టు. దాని ధర నిర్ణయించే అధికారం వారికే ఉంటుంది తప్ప మరెవరికీ ఉండదు. అందుకే సినిమా టికెట్ ధర రూ.10వేలు పెట్టినా నష్టం లేదు. ఇష్టమున్న వాళ్లే చూస్తారు.’ అని కూడా సెలవిచ్చారు. నిజమే ఆ ఆర్గ్యుమెంట్‌లో వాస్తవం ఉన్నది. మరి సమాజానికి నష్టం కలిగిస్తున్న అనేక వస్తువులపై ప్రభుత్వాలు భారీగా పన్నులు విధి స్తాయి. మరి వయలెన్స్ కంటెంట్ ఉన్న సినిమాలకు ఎందుకు రెండిరతలు మూడిరతల పన్ను విధించవద్దు అప్పుడు ఆ పన్ను కట్టేందుకు సిద్ధమైనవాళ్లే వయలెన్స్ సినిమాలు తీస్తారు. చెడు విషయంలోనూ మానవీయ కోణమేనా? నిజానికి ప్రభుత్వాలు.. సినిమాలను కేవలం వందల కోట్లతో నిర్మించారు అన్న కోణంలోనో.. లేక ఆ పరిశ్రమలో వేలమంది పనిచేస్తున్నారు అన్న మానవీయ కోణంలోనో చూస్తుంటాయి.
కానీ, సిగరెట్లు, మద్యం మనుషుల ప్రాణాలు తీస్తాయి కదా.. వాటిపై ఎక్కువగా భారీగా పన్నులు వేసినట్టే వయలెన్స్ సినిమాలకు కూడా దాన్ని వర్తింపజేయాలి. సినిమాలో ఉన్న స్టాండర్డ్స్ ఆధారంగా సెన్సార్ బోర్డు వాళ్లు సర్టిఫికెట్ ఇచ్చినట్టుగానే ప్రభుత్వం కూడా వయలెన్స్ ఆధారంగా పన్ను శ్లాబులు అమలు చేయాలి. అలా చేయడం వల్ల సినీ పరిశ్రమ మూసివేయాల్సి వస్తుందని వాదనలు వస్తే.. సిగరెట్, మద్యం తయారీ పరిశ్రమలపై సైతం ఆంక్షలు తొలగించాలి. ఎందుకంటే ఆ పరిశ్రమల్లోనూ వేల మంది కార్మి కులు పనిచేస్తుంటారని మరిచిపోవొద్దు. సిగరెట్, మద్యం ధరలు భారీగా పెంచడం వల్ల కనీసం కొంతమంద్కెనా వాటికి దూరంగా ఉంటారు. అలాగే పన్ను భయంతో సినిమాల్లో కనీసం హింస కంటెంట్ తగ్గించే అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో పాజిటివిటీ పెంచే సినిమాలకు అనేక రిబేట్లు ఇవ్వాలి. దీనివల్ల నిర్మాతల ఆలోచనా ధోరణిలోనూ మార్పు వచ్చే అవకాశం ఉన్నది. సినిమాల్లో నెగిటివిటీని తగ్గించాల్సిందే! నిజానికి ఎన్నో సినిమాలు ఫీల్ గుడ్ ఆంబియెన్స్‌తో ఉంటాయి.
వాటిని చూసి సినిమా థియేటర్ నుండి బయటికి వొచ్చినా మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది. అయితే, మానసిక పరిశోధనల ప్రకారం మానవులు తాము చేయలేని అతీంద్రియ చర్యలను సినిమాల్లో చూసి మానసికంగా సంతోషపడతాడు. అందుకే ఫాంటసీ, సాధ్యం కాని రేటింగ్ సీక్వెన్స్‌లకు ఎప్పు డూ ప్రేక్షకాదరణ ఉంటుంది. అయితే, సినిమాల్లో చూపించే ఘటనలు నిజజీవితంలోనూ చేయాలి అనిపించేంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం వల్ల యువత నేరాల బాట పట్టే అవకాశం ఉన్నది. సినిమాల ప్రభావంతో రియాలిటీకి, ఫాంటసీకి మధ్య ఉన్న తారతమ్యాన్ని యువత గుర్తించలేక పోతున్నది. కొన్ని సినిమాల్లో హీరో చేసే వయలెన్స్‌కి హీరోయిన్ పడిపోవడం చూపిస్తుంటారు. దాన్ని కొందరు మానసిక పరిపక్వత యువకులు కాపీ కొడుతూ అమ్మాయిల భద్రతకు ప్రశ్నార్థకంగా మారుతున్నా రు. ఇలా ఎన్నో అంశాల్లో సినిమాలు యువతపై చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సిగరెట్, మద్యం మనిషి ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో సినిమాల్లో హింస, నెగిటివిటీ మానసిక ఆరోగ్యానికి అంతే ప్రమాదకరం. ప్రభుత్వం దీనివిరీద దృష్టిపెట్టాలి.
-చరణ్