– యంగ్ ఇండియా స్కూళ్లతో విద్యాభివృద్ధి
– ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాతో సిఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 13: జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థుల మధ్య కుల వివక్షను దూరం చేసేందుకు కీలక చర్యలు చేపట్టామని వెల్లడించారు. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి వీటిని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేశామని సీఎం వ్యాఖ్యానించారు. విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ స్కూల్లోనే అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. విద్యార్థులకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని అన్నారు. కోర్ అర్బన్ రీజియన్ లోపల ఉన్న ప్రాంతంలో మొదటగా వీలైనన్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను పెంచుతున్నామని వివరించారు. రాష్ట్రంలో ఉన్న ఎస్సీలకు వారి జనాభా శాతం కంటే ఎక్కువ అవకాశాలను కల్పిస్తున్నామని సీఎం వెల్లడించారు. రాజకీయాల్లో, ఇతర రంగాల్లో కీలక స్థానాల్లో ఎస్సీలకు అవకాశాలు కల్పించామని వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చొరవ చూపాలని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు