– ఏషియా అండర్-23 అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పరుగు పందెంలో..
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13 : చైనాలోని ఒర్డోస్‌లో జరుగుతున్న తొలి ఏషియా అండర్-23 అథ్లెటిక్ చాంపియన్‌షిప్-2026లో మహిళల 4I400 రిలే పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించిన ప్రవల్లిక నరిమళ్లకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ బిడ్డ ప్రవల్లిక ఆసియా-23 అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్స్‌లో అసమాన ప్రతిభ కనబరిచి మహిళల 4I400 మీటర్ల రిలేలో ఆమె స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. నల్గొండలోని ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలో చదువుతూ డిండి గురుకుల స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొంది అంతర్జాతీయ వేదికపై రాణించిన ప్రవల్లిక యువ క్రీడాకారులు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. తాపీ మేస్త్రీ కూతురైన ప్రవల్లిక పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారన్నారు. ఈ జట్టులో ప్రవల్లిక, శ్రావణి సచిన్ సాంగ్లే, సాంద్రమోల్ సాబు, నోఫిసా ఖతూన్‌లతో కలిసి స్వర్ణ పతకం సాధించారు. ఈ నలుగురి బృందం 3:33.62 సెకన్ల సమయంతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని, ఆతిథ్య దేశమైన చైనాను అధిగమించింది. అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడానికి ముందే ప్రవల్లిక వివిధ వేదికల్లో 23 స్వర్ణాలు సహా మొత్తం 35 రాష్ట్రస్థాయి పతకాలను సాధించి అద్భుతమైన దేశీయ రికార్డును నెలకొల్పారు. ప్రవల్లికకు శిక్షణ అందించిన కోచ్‌లకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఈ చాంపియన్‌షిప్‌లో మొత్తంగా 3 స్వర్ణ, 4 రజత, 9 కాంస్య పతకాలతో 16 పతకాలను సాధించిన భారత క్రీడాకారులందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




