మూడేళ్లలో హైదరాబాద్‌ వ్యాప్తంగా ఎలక్టిక్ర్‌ బస్సులు

– ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : రెండేళ్లలో 2,500 కొత్త బస్సులు కొనుగోలు చేశామని ఆర్టీసీ సంస్థ‌ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో 800కు పైగా ఎలక్టిక్ర్‌ బస్సులు ఉన్నాయని, మూడేళ్లలో హైదరాబాద్‌ వ్యాప్తంగా, అనంతరం గ్రావిూణ ప్రాంతాల్లోనూ ఎలక్టిక్ర్‌ బస్సులు తీసుకు వస్తామని తెలిపారు. భద్రాచలం ఆర్టీసీ డిపోను ఆయన మంగళవారం సందర్శించారు. మొక్కలు నాటిన తరువాత బస్సులను పరిశీలించారు. ఆ తర్వాత విూడియాతో మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రాబడి పెరుగుతోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రోజూ పది వేల బస్సుల్లో 60 లక్షల మందిని తరలిస్తున్నామని, వీరిలో దాదాపు 45 లక్షల మంది మహిళలు ఉంటున్నారని తెలిపారు. ఇప్పటివరకు 250 కోట్లకు పైగా మహిళలు ఉచిత ప్రయాణం చేసినట్లు నాగిరెడ్డి వివరించారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు రూ.8,500 కోట్లు ఆదా అయిందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page