నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా, రాహుల్‌లకు ఊరట

న్యూదిల్లీ, డిసెంబర్‌ 16: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో వారితోపాటు మరో ఐదుగురిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు దిల్లీ కోర్టు మంగళవారం నిరాకరించింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం లేదా పీఎంఎల్‌ఏ కింద ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదును ఎఫ్‌ఐఆర్‌ లేకుండా సమర్థించలేమని రోస్‌ అవెన్యూ కోర్టు పేర్కొంది. ఈ కేసులో దిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని, దీంతో ఈడీ చార్జిషీటుపై ముందస్తుగా స్పందించలేమని తెలిపింది. నేషనల్‌ హెరాల్డ్‌ మాతృసంస్థ అయిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ను మోసపూరితంగా స్వాధీనం చేసుకోవడానికి కుట్రపన్నారని ఆరోపిస్తూ సోనియా, రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ విదేశీ విభాగం చీఫ్‌ శామ్‌ పిట్రోడా సహా ఐదుగురిపై ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యు) గత నెలలో నివేదికను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page