– డీజీపీ శివధర్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10: రాష్ట్రంలో గురువారం జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు జిల్లాల పోలీస్ యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లుచేసిందన్నారు. మొత్తం 3,800కు పైగా పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా.. 3వేల పంచాయతీల్లో పోలింగ్‌ను నేరుగా వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నట్టు చెప్పారు. బందోబస్తులో సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వు, ఇతర స్పెషల్ పోలీస్ సిబ్బంది కూడా పాల్గొంటారని తెలిపారు.సాధారణ పోలింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు సిబ్బంది పూర్తి స్థాయి విధుల్లో ఉంటారన్నారు. ఇప్పటి వరకు రూ.8.20 కోట్ల విలువ చేసే మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువుల స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ తెలిపారు. 54 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న చెక్‌పోస్టులు 24 గంటలూ పనిచేస్తున్నాయన్నారు. ప్రజలంతా తనిఖీలకు సహకరించి ప్రశాంతంగా వోటింగ్‌లో పాల్గొనాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.