తెలంగాణలో విద్యావ్యవస్థ చిన్నాభిన్నం

– నాటి బీఆర్‌ఎస్‌, ‌నేటి కాంగ్రెస్‌ ‌విధానాలే కారణం
– ఏబీవీపీమహాసభల్లో కేంద్రమంత్రి బండి సంజయ్‌

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో, కాంగ్రెస్ రెండేళ్ల పాల న ఫలితంగా తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో 6 వేల స్కూల్స్ మూసివేస్తే కాంగ్రెస్ పాల నలో వాటిని తెరవకపోగా ఒక్క ఏడాదిలోనే 1500 స్కూల్స్ మూసివేశారని చెప్పారు. ప్రతి విద్యార్థికి 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని గాలికొదిలేశారని, ఫీజు రీయంబర్స్ మెంట్ రాక కాలేజీలు మూతపడుతున్నా పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ శంషా బాద్ లోని ఎస్సెస్సార్ కన్వెన్షన్ లో సోమ వారం ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సభలకు రాష్ట్ర విద్యార్థి పరిషత్ అధ్యక్షులు హెచ్ సీయూ ప్రొఫెసర్ రావుల క్రిష్ణ, కార్యదర్శి రాంబాబు, కర్నె రామచందర్, గీతాసింగ్, భీమనపల్లి శ్రీకాంత్ హాజరైన ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా పానగల్ కు చెందిన సామాజిక కార్యకర్త, హెచ్ఐవీ బాధితులకు, వారి పిల్లలకు అనేక రకాలుగా సేవలందిస్తున్న భీమనపల్లి శ్రీకాంత్ కు ‘జనమంచి గౌరీశంకర్ జీ యువ పురస్కార్ ను కేంద్ర మంత్రి అందజేశారు. అనంతరం మహాసభలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page