– వీసీల సమావేశంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: సమగ్ర అభివృద్ధికి విద్యనే కీలకమని గవర్నర్, యూనివర్సిటీల చాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో గవర్నర్’ అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సమావేశం, నషా ముక్తే యువ వికసిత్ భారత్, మై భారత్ పోర్టల్, రెడ్ క్రాస్ సొసైటీ తదితర అంశాల్లో విద్యార్థుల భాగస్వామ్యం, పేర్ల నమోదుపై లోక్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఉన్నత విద్యను సమీక్షించారు. యూనివర్సిటీలు కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా గ్రామీణ, వెనుకబడిన వర్గాలకు తమ సేవలను విస్తరించాలని సూచించారు. దేశంలోని మానవ వనరుల ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందుకోవాలంటే యువతకు విజ్ఞానంతోపాటు జీవన నైపుణ్యాలు, నైతిక విలువలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిలో భాగంగా ఎంజీయూ వీసీతోపాటు పలువురు వీసీలు మొదటి తరం విద్యార్థులలో ఆరోగ్య అవగాహన, హెచ్ఐబీ నివారణ, రక్తదానం, జీవన నైపుణ్యాల పెంపొందించడంలో రెడ్ రిబ్బన్ క్లబ్ లు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రస్తావించారు. దీనిలో భాగంగా సమాజ శ్రేయస్సు కోసం ప్రత్యేక ఏఎస్ఆర్ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రభుత్వం, పౌర సమాజంతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ లోక్ భవన్ తో సమన్వయంతో ముందుకు సాగాలని వీసీలు నిర్ణయించారు. సమావేశంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఇతర అంశాలను వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ వివరించారు. ఉన్నత విద్యా రంగానికి విశేష సేవలు అందిస్తున్న సీనియర్ వైస్ చాన్సలర్లలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్ ను గవర్నర్ పుష్పాగుచ్చాలు అందచేసి ఘనంగా సన్మానించి అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





