మరో మారు చారిత్రక తప్పిదం చేయొద్దు

కులగణన అనే ప్రజాస్వామ్య ఉద్దేశ్యాన్ని ఇవాళ రాజకీయ పార్టీలు చేపట్టడంలో దేశంలో జరిగిన సుదీర్ఘ ఉద్యమాల పరంపర ఉన్నది. మండల్‌ ఉద్యమ కాలం నుంచి వచ్చిన చైత న్యం దీనిని పోగు చేసింది. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్క రణల అనంతరం ప్రభుత్వం పట్టించుకోబడని మెజారిటి ప్రజల సుదీర్ఘ తాపత్రయం ఒక డిమాండ్‌గా రూపాంతరం చెందింది. దీనిని ఎప్పటిలాగే ఆధిపత్య శక్తులు నియంత్రిస్తూ వస్తున్న ప్పటికి ఈ డిమాండ్‌ ‌నేటి రాజ్యాంగ పరిరక్షణ దృక్ప థంలో ప్రధాన భూమికగా నిలబడ్డది.ఈ క్రమంలోనే దేశంలో ప్రధాన ప్రతిపక్షం ఈ కులగణను తన అజెండాలోకి తీసుకోగలిగింది.ఈ మేరకు ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించడానికి తనకు ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతాలలో దీన్ని ఒక ప్రయోగాత్మకంగా చేపట్టి ప్రజల్లో విశ్వాసాన్ని పొందేందుకు ప్రయత్ని స్తున్నది.

ఆ క్రమంలోనే కర్ణాటకలో, తెలంగాణలో కులగణనను చేపట్టింది. ఇప్పటికే బీహార్‌ ‌రాష్ట్రం దీనిని పూర్తిస్థా యిలో విడుదల చేసింది. కులగణన సర్వే కర్ణాటకలో ఇంకా బహిర్గత పరచనప్పటికీ తెలంగాణలో సర్వే 50రోజులపాటు నిరంతరాయంగా కొనసాగించి అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది.కాని ఉన్నత ఆశయంతో ప్రారంభించిన ఈ సర్వే కొనసాగు తున్న సమయంలోనే అనేక తప్పుడు సంకేతాలతో కొనసాగింది.ఈ సర్వేను అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత అసంపూర్ణంగాను తప్పుల తడకగాను ఉన్నదన్న విషయం రూఢి అయ్యింది.ఈ క్రమంలో తిరిగి ప్రజా డిమాండ్‌ ‌ను ప్రభుత్వం ఒక మేరకు పట్టించుకున్న ట్లుగా, పరిగణలోకి తీసుకు న్నట్లుగా కనిపిస్తున్నది. ఇప్పటికే అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టారు. ఏ ప్రామాణికత,ప్రాతిపదికన దీనిని ప్రవేశపెట్టారు.? ఏ కోణంలో సర్వేను ఆమోదిస్తున్నట్లు తీర్మానం చేశారు.? అసెంబ్లీలో ప్రవేశ పెట్టినప్పుడు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి.? ఇప్పుడు ఏ ప్రామాణికత సాధించడానికి మళ్లి సవరణ సర్వే చేస్తున్నారు.? ఈ మార్పు వెనుకాల ప్రభుత్వం గుర్తించిన అంశాలు ఏమిటి.?  ఒకవేళ గుర్తించబడిన అంశాలు వాస్తవం అయితే మొత్తం రీ సర్వేచేయాలి ..!

తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే పై వచ్చిన విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంది. ఇదివరకు నిర్వహించిన సర్వేలో పాల్గొనని 3.1% కుటుంబాలు సర్వేలో పాల్గొనడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలియజేశారు.ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు జరిగే సర్వేలో,పాల్గొనని వాళ్లంతా పాల్గొనాలని స్పష్టం చేస్తుంది.ఈ  3.1% మంది తమ వివరాలు ఇచ్చేం దుకు మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయం, ఆన్లైన్లో, టోల్‌ ‌ఫ్రీ నెంబర్‌  అనే మూడు మార్గాల ద్వారా వివరాలు నమోదు చేసుకోవచ్చని ప్రకటిం చారు. ఈ క్రమంలో ప్రభుత్వం మరొక చారిత్రక తప్పిదం చేయకుండా కొన్ని విషయాలను గుర్తుంచు కోవాల్సిన అవసరం ఉన్నది.

ఈ సందర్భంలో ప్రభుత్వం సర్వేలో పాల్గొనని వారికి అవకాశం కల్పిస్తామని చెపుతుంది. ఇది ఆహ్వాని ంచదగ్గ పరిణామమే.కాని ఇది ఏ విధంగా సంపూర్ణమైనటువంటి ప్రామాణిక నివేదికను తోడ్పడగ లుగుతుంది.? సర్వేలో పాల్గొననివారిని మళ్ళీ  సర్వేలో పాల్గొనమని ఆదేశించడం మంచి పరిణామమే కాని ఇప్పటివరకు ఆధిపత్య కులాల జనాభా సంఖ్య పెరిగింది కదా.! బలహీన వర్గాల జనాభా సంఖ్య తగ్గింది కదా దీన్ని ఏ విధంగా నిగ్గు తేలుస్తారు..? ఇప్పుడు ఒక కుటుంబానికి సంబంధించినటువంటి డేటాను మొత్తం కూడా ఎన్యుమరేటర్లు ఊహించి లేదా పక్కవారిని అడిగి తెలిసో తెలువకో డేటా ఎంట్రీ చేసినారు.మొత్తం కూడా తప్పులతడకగా ఎంట్రి చేసారు.అలాంటి తప్పిదాలను ఇప్పుడు ఏ విధంగా సవరిస్తారు.? సవరించడానికి అవకాశం లేకపోతే ప్రామాణికమైన సర్వే ఎట్లా ఐతది..? ప్రభుత్వం చేసిన తొందరపాటు కూడా ఉన్నది ఏదో చేయాలనే ఉద్దేశ్యంతో క్రాస్‌ ‌చెక్‌ ‌చేసుకో కుండా లెక్కలు వెల్లడించడం అనేది ప్రభుత్వం  ఘోరమైనటువంటి వైఫల్యం.ప్రభుత్వం  అంతర్గతం గానైనా కనీసం ఒక్క మండలమో, ఒక గ్రామమో ఒక జిల్లాలోనైనా రాండంగా క్రాస్‌ ‌చెక్‌ ‌చేసుకోవాల్సి ఉండే.మంచి ఫలి తాలు వచ్చి ఉండేవి.అదేమి లేకుండా తొందరపాటు చర్యలతో వెల్లడించి ప్రజల ముంధు పలుచనైనది.


అర్హత లేని ఎన్యుమరేటర్లు పెట్టడం సర్వేలో జరిగినటువంటి ప్రధాన తప్పిదం. ఎన్యుమ రేటర్లు తమకు తోచిన సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. కనీసం సంబంధిత కుటుంబంతో అనుసం ధానం లేకుండా ఊహాజనిత సమాచారాన్ని సేకరించి పెట్టా రు. బాధ్యతలు అప్పగించిన ఎన్యూమరేటర్లు తమ పనిని సక్రమంగా నిర్వర్తించకుండా అంగన్వాడీ టీచర్లకు, పీల్డ్ అసిస్టెంట్‌లకు, గ్రామపంచాయతీ కార్మికులకు అప్పగించారు.ఈ పర్పస్‌ ‌లో జరిగిన నష్టానికి ప్రభుత్వం ఏ విధంగా బాధ్యత తీసుకుం టుంది.? బాధ్యత తీసుకొని యెడల సర్వే వల్ల సాధించేది ఏముంది.? నష్టమే తప్ప ప్రయోజనం శూన్యం.సర్వే జరిగినప్పుడు మంత్రి వర్గ ఉప సంఘం అధ్యక్షతన సబ్‌ ‌కమిటీ వేశారు కధా.! అది ఏమైనా మానిటరింగ్‌ ‌చేసిందా.!ఒకవేళ మానిటరింగ్‌ ‌చేసినట్లయితే ఆ సంబంధిత మినిట్స్ ఉన్నాయా.! అవి భయట పెట్టగలరా..! ఇవన్ని బహిర్గత పరిచితేనే జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి అవకాశం ఉంటు ంది. వ్యక్తిగత గోప్యత ఉద్దేశ్యం పేరుతో సమాజానికి అవసరమైన చాలా సమాచారాన్ని ప్రభుత్వం తన దగ్గర ఉంచుకోకూడదు. దాన్ని బహిరం గపరచాలి. ఎందు కంటే ప్రజల సొమ్ముతో సర్వే సమాచారాన్ని సేకరిస్తు న్నప్పుడు దాచిపెట్టడం సరికాదు.

ఇప్పటి వరకు ఏ సామాజిక వర్గాలు ఏ మేరకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పొందగలిగినాయి.! ఇంకా ఏ సామాజిక వర్గాల రాజకీయ ప్రాతినిధ్యాలకు దూరంగా ఉన్నాయి.? ఆ లెక్కలన్నింటిని కూడా బయట పెట్టాలి. తద్వారా నష్టపోయిన సామాజిక వర్గాలను గుర్తించే అవకాశం ఉంటది.ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన సర్వే చేసిన వివరాలను గ్రామాల వారిగా,వార్డుల వారీగా బయట పెడితే జరిగిన తప్పిదాలను సవరించుకునే అవకాశం ఉంటుంది.ఈ విషయంలోప్రభుత్వం పంతానికి పోవలసిన అవసరం లేదు. ప్రతిపక్షాలకు ఒక ఆయు ధం ఇచ్చిన వాళ్ళం అవుతామనే విషయాన్ని అసలే పరిగణలోకి తీసుకోవద్దు.ఒక అతిపెద్ద ప్రజాస్వామిక బద్ధమైన కార్యం చేపట్టినప్పుడు విమ ర్శలు సహజం. ప్రభుత్వము ఇప్పటికైనా నిర్దిష్టంగా ప్రజలలో చైత న్యాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది.సర్వేలో పాల్గొనని వారికి గట్టి హెచ్చరికలు జారీ చేయాలి. సర్వేలో పాల్గొనని కుటుంభాలు అసలే పాల్గొనక పోగా కొంతమంది మాత్రం అర్బన్‌ ‌మరియు రూరల్‌ ‌ప్రాంతాలలో రెండు చోట్ల పాల్గొంటున్నారు. అలాంటి వారికి కూడా గట్టి హెచ్చరిక జారీ చేయాల్సిన అవ సరం ఉన్నది.ప్రజలను చైతన్యవంతం చేయకుండా సర్వే చేపడితే అసలు ఉద్దేశానికి భంగకరం కలిగే ప్రమాదం ఉంది.సర్వే పారదర్శకంగా కొనసాగాలంటే ఇప్పటికైనా నిష్ణాతులైన ఎన్యుమరేటర్లకు పకడ్బందీగా శిక్షణను ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.ఏలాంటి సందే హాలకు తావులేకుండాఇండిపెండెంట్‌ అథారిటీ కలిగిన ఒక ఏజెన్సీని ప్రత్యేకంగా కులగణన కోసం ఏర్పాటు చేయాలి.

మళ్లీ సర్వే చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమై తాయి, కేంద్రం నిధులు మరిన్ని రోజులు ఆగిపోయే ప్రమాదం ఉందని ఉపముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అలా అని తొందరపాటు చర్యలతో సర్వే చేసి బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయవద్దు. సమగ్రంగా సుశిక్షితులైన వారితో సర్వే చేపించి తీరా ల్సిందే. ప్రభుత్వం చెబుతున్నట్లుగా మండల కార్యాల యాల్లోకి వెళ్లి నమోదు చేసుకోవడం అనేది అసా ధ్యమైన విషయం ప్రభుత్వ అధికారులే స్వయంగా వెళ్లి మొత్తంగా  సర్వే చేయాల్సిన అవసరం ఉన్నది. టోల్‌ ‌ఫ్రీ నెంబర్‌ ‌కి ఫోన్‌ ‌చేసి వివరాలు ఇవ్వవచ్చు అంటు న్నారు. 56 ప్రశ్నలకు ఎంత సమయం పడుతు ందో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రతిపక్షాలు కూడా రాజకీయ స్వార్థం కోసం విమర్శించడమే కాకుండా ప్రజాస్వామిక డిమాండ్‌ ‌ను నెరవేర్చడానికి బాధ్యతాయుతంగా ప్రజలందరు సర్వేలో పాల్గొనేలా చొరవ చూపాల్సిన అవసరం ఉన్నది.బిసి  సంఘాలు ,ప్రజా సంఘాలు కూడా సైలెంట్‌గా ఉండడం చేత కుల గణన అనేది పక్కదోవ పట్టింది. చేయాల్సినంత వర్క్ ‌చేయలేదు. ఇప్పటికైనా కుల సంఘాలు,వృత్తి సంఘాలు సామాజిక సంఘాలు తమ భాగస్వామ్యాన్ని అందించడం ద్వారా కొంత మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చు. సర్వేలో భాగస్వామ్యాన్ని పెంచవచ్చు.ఇది ఒక చారిత్రక అవసరం. ఇది సమగ్రంగా కొనసాగి నట్లయితే భవి ష్యత్తు తరాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యా పరమైన ప్రయోజనాలు మరింత చేకూరే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజాస్వామ్యంలో భాగస్వాములు అవుతారు.
image.png
పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక 9441661192

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page