– ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
– రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించిన మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: భారీ వర్షాల వల్ల జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి ప్రొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అపమ్రత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. తుఫాన్ వల్ల తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలపై రెవెన్యూ, విపత్తుల నిర్వహణ అధికారులతో మంత్రి బుధవారం సమీక్షించారు. రాగల 24 గంటల్లో అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్, యాదాద్రి భువనగిరి, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని enl ఆయన ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితి గురించి మంత్రి ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టవలసిన రక్షణ సంబంధిత చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్తు, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి తదితర విభాగాలతో రెవెన్యూ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని సూచించారు. వాగులు, కాల్వలు, చెరువుల దగ్గర పోలీసులతో పర్యవేక్షించాలని, స్థానిక అధికారులు అత్యవసర సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





