హైదరాబాద్ నుంచి అయోధ్య కు విమాన సర్వీసులు

సద్వినియోగం చేసుకోవాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
 హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు విమాన సర్వీసులు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. శుక్రవారం సెప్టెంబర్ 27 న హైదరాబాద్ – కాన్పూర్ మధ్యన, హైదరాబాద్ నుంచి అయోధ్య మధ్యన వారానికి 4 రోజుల సర్వీసును, శనివారం సెప్టెంబర్ 28  హైదరాబాద్ – ప్రయాగరాజ్ మధ్యన, హైదరాబాద్ – ఆగ్రా మధ్యన వారానికి 3 రోజుల సర్వీసును ప్రారంభించనున్నారు.
 హైదరాబాద్ నగరం నుంచి ఇలా ఒక్క నెలలోనే 7 నూతన సర్వీసుల ప్రారంభం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి శ్రీ కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నూతన సర్వీసులు ఆయా నగరాల మధ్యన ప్రయాణికుల డిమాండ్ ను నెరవేరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కిషన్ రెడ్డి ప్రయాణికులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *