– ప్రణాళిక రూపొందించాలని సీబీఐకి ఆదేశం
న్యూదిల్లీ, అక్టోబర్ 27: డిజిటల్ అరెస్టులపై సీబీఐ దర్యాప్తు జరగాల్సి ఉందన్న అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు వ్యక్తం చేసింది. వరుసగా జరుగుతోన్న సైబర్ నేరాల కారణంగా పలువురు ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ కేసుల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఇటీవల వచ్చిన ఓ కేసును సుమోటాగా తీసుకొని విచారణ జరుపుతోంది. ఈ నేరాలపై సీబీఐ దర్యాప్తును పర్యవేక్షిస్తానని పేర్కొంది. డిజిటల్ అరెస్టు కారణంగా తాను రూ.కోటి కోల్పోయానని హరియాణాకు చెందిన ఓ వృద్ధ మహిళ కేసు వేసిన నేపథ్యంలో ఈ విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మయన్మార్, థాయ్‌లాండ్ వంటి ఆఫ్‌షోర్ లొకేషన్ల నుంచి ఇలాంటి కేసులు వెలుగు చూస్తున్నాయని, ఈ కేసుల దర్యాప్తునకు ఒక ప్రణాళికను రూపొందించాలని సీబీఐను ఆదేశించింది. కేంద్ర ఏజెన్సీ దర్యాప్తులో పురోగతిని పరిశీలిస్తామని, దాన్నిబట్టి అవసరమైన ఆదేశాలను జారీ చేస్తామని పేర్కొంది. అలాగే డిజిటల్ అరెస్టు కేసులకు సంబంధించి వివిధ రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్ వివరాలను సమర్పించాలని ఆయా ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





