విద్యార్థి సంఘాల హర్షం
Dharmendra Pradhan Region | కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం మధ్యాహ్నం రాజీనామా చేశారు. ‘నీట’ పేపర్ లీక్, యÖపీఎస్‌సీ పరీక్షల నిర్వహణపై వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. నీట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు నిరసనలు చేపట్టి, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పరీక్షల వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026 ముసాయిదాను విడుదల చేసి పేపర్ లీక్‌లు, పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలు, భారీ జరిమానాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కాలపరిమితిలో విచారణ వంటి కీలక నిబంధనలను ప్రతిపాదించింది. అయితే రాజీనామాపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన, రాష్ట్రపతి ఆమోదం వంటి అంశాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, విద్యార్థి సంఘాలు ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, బాధ్యులపై కఠిన చర్యలు, దీర్ఘకాలిక సంస్కరణలు అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. దీంతో నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన తీవ్ర ఆందోళనలు, తెచ్చిన ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చినట్టయింది.




