చేవెళ్ల రోడ్డు ప్రమాదస్థలిని సందర్శించిన డిజిపి

– టిప్పర్‌ ‌వేగంతోనే బస్సుకు ప్రమాదం
– టిప్పర్‌ ‌డ్రైవర్‌ ‌నిర్లక్ష్యమే ప్రమాద కారణం
– దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 4:  చేవెళ్ల మండలం ర్జా గూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడవుతాయని తెలంగాణ డీజీపీ శివధర్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం డీజీపీ శివధర్‌ ‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. టిప్పర్‌ అతివేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తే టిప్పర్‌ ‌డ్రైవర్‌ ‌నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని డీజీపీ శివధర్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఇక రోడ్డు ప్రమాదానికి గురైన టిప్పర్‌ ‌కండిషన్‌ను మెకానిక్‌ ‌ద్వారా పరీశీలిస్తున్నా మన్నారు. దాదాపు 40 టర్లు టిప్పర్‌ ‌లాక్కేళ్లడంతో ఈ ప్రమాద తీవ్రత పెరిగిందని వివరించారు. ఈ ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో రైట్‌ ‌సైడ్‌ ‌కూర్చున్న వారు చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అయితే రోడ్డు మలుపు ఉంది కానీ.. అది యాక్సిడెంట్‌ అయ్యేంత తీవ్రంగా లేదన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన టిప్పర్‌ ‌లారీ ఓనర్‌ ‌లక్ష్మణ్‌ ‌నాయక్‌ ‌ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను ప్రభుత్వ పరంగా చూడకూడదని.. ఇది అందరి బాధ్యతగా చూడాల్సి ఉందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. రోడ్డు ప్రమాదాలు పెద్ద సమస్యగా మారిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది ప్రయాణికులు రోడ్డు ప్రమాదాల కారణంగానే మరణిస్తున్నారని గుర్తు చేశారు. రోడ్డు ద డ్రైవ్‌ ‌చేసే వారు డిఫెన్స్ ‌కండిషన్‌ను అంచనా వేసుకొని డ్రైవ్‌ ‌చేయాల్సి ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలపై వచ్చే నెల నుంచి అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రమాదాన్ని చేవెళ్ల ఏసీపీ విచారణ అధికారగా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన అన్ని వివరాలు త్వరలో వెల్ల‌డిస్తామని డీజీపీ శివధర్‌ ‌రెడ్డి వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page