డ్యుయిష్‌ బోర్స్‌ జీసీసీతో వెయ్యిమందికి ఉద్యోగాలు

– సీఎం రేవంత్‌తో జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ బృందం భేటీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: డ్యుయిష్‌ బోర్స్‌ (Deutsche Borse) కంపెనీ విస్తరణలో భాగంగా తమ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌(జీసీసీ)ని హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ మైఖేల్‌ హాస్పర్‌ బృందం వివరించింది. జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు జర్మనీ బృందానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, ఇందుకు ప్రజాప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌ డ్యుయిష్‌ బోర్స్‌ కంపెనీ జీసీసీ ఏర్పాటుతో వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో వెయ్యిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు సీఎంకు జర్మనీ బృందం వివరించింది. హైదరాబాద్‌ను ఇన్నోవేషన్‌ హబ్‌గా తయారు చేసేందుకు సహకరించాలని జర్మనీ బృందాన్ని సీఎం కోరారు. హైదరాబాద్‌లో జర్మనీ టీచర్లను నియమించి తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాషను నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ను కోరారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటోందన్న సీఎం టీ, ఫార్మా, ఆటోమొబైల్‌ రంగంలో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కూడా విజ్ఞప్తి చేశారు. వీటితో టావమ్‌కావమ్‌ ద్వారా వొకేషనల్‌ ఎడ్యుకేషన్‌, స్కిల్‌ వర్క్‌ విషయంలో శిక్షణ అందించేందుకు సహకరించాలని కూడా కోరారు. ఈ భేటీలో అమిత దేశాయ్‌, డ్యుయిష్‌ బోర్స్‌ సీఐవో/సీవోవో డాక్టర్‌ క్రిస్టోఫ్‌ బోమ్‌, సీఎం స్పెషల్‌ సెక్రటరీ అజిత్‌ రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page