- సమయం కోరిన అసెంబ్లీ సెక్రటరీ లాయర్
- 18కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
న్యూదిల్లీ, ఫిబ్రవరి 10 (ఆర్‌ఎన్‌ఎ) : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోమారు వాయిదా పడింది. ఏడుగురు ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ తన పిటిషన్‌లో తెలంగాణ స్పీకర్, ఎమ్మెల్యేలు పి.శ్రీనివాస్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, టి.ప్రకాశ్‌గౌడ్, అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్‌లను ప్రతివాదులుగా చేర్చారు. జస్టిస్ గవాయ్ ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. స్పీకర్ నుంచి సమాచారం కోసం మరింత సమయం కావాలని రోహత్గీ కోర్టును కోరారు. స్పీకర్‌తో చర్చించి వివరాలు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే 10 నెలలు పూర్తయిందని.. ఇంకెంత గడువు కావాలని ధర్మాసనం ప్రశ్నించింది.
ముకుల్ రోహత్గీ విజ్ఞప్తితో పిటిషన్‌పై తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఈ పిటిషన్ పెట్టారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటరీ పక్రియను ఫ్రస్టేష్రన్‌కు గురి చేయొద్దని, ప్రజాస్వామ్యంలో పార్టీలకు హక్కులు ఉంటాయని తెలిపింది. ఎమ్మెల్యేలు పార్టీలు మారి 10 నెలలు అయింది.. ఇది రీజనబుల్ ట్కెం కాదా అంటూ సుప్రీం కోర్ట్ ప్రశ్నించగా..మాకు వాదనలు వినిపించేందుకు రెండు మూడు రోజుల సమయం కావాలని రోహిత్గి కోరారు. మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పుల ప్రకారం రీజనబుల్ ట్కెమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని బిఆర్‌ఎస్ వాదిస్తుంది. రీజనబుల్ ట్కెమ్ అంటే ఎంత సమయం కావాలో చెప్పండని కోర్టు లేవనెత్తింది. అనంతరం ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, ఈ పిటిషన్‌పై విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.
రాజ్యాంగ విలువలకు భంగం : కేటీఆర్
పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగిస్తాయని కేటీఆర్ ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల చర్యలతో ప్రజల నమ్మకానికి ద్రోహం చేసినట్లు కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ కేసు తదుపరి విచారణకు వేచి చూడాల్సి ఉంది. బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ వరుస పిటిషన్లు దాఖలు చేసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో పాటు వివేకానంద గౌడ దాఖలు చేసిన రెండు పిటిషన్లతో పాటు ఇటీవల తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. గతంలో పాడి కౌశిక్ రెడ్డి, వివేకా కలిసి పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై పిటిషన్ వేయగా.. మరో ఏడుగురి పేర్లను జత చేసి కేటీఆర్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు పిటిషన్లను జత చేసి ఈరోజు సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి దాదాపు 10 నెలలు అవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని… వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోర్టు ముందు వాదనలు వినిపించారు బీఆర్‌ఎస్ తరపు న్యాయవాది. అనంతరం కేసు విచారణను 18కి వాయిదా వేసింది ధర్మాసనం. ఈ క్రమంలో 18న జరగబోయే వాదనలపై ఉత్కంఠ నెలకొంది.