ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి గుండెపోటుతో మృతి

మునుగోడు, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : గ్రామ సర్పంచ్ ప‌ద‌వికి పోటీ చేసి లక్షల రూపాయలు ఖర్చు చేసి ఓడిపోయాన‌ని తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించాడో అభ్య‌ర్థి. ఈ సంఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే నల్గొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామా నికి చెందిన చెనగొని కాటంరాజు (45) ఈనెల 11న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్య ర్థిగా పోటీ చేసి సమీప అభ్యర్థి పై 143 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అప్పటినుంచి తీవ్ర మనోవేదనకు గురై ఆదివారం గ్రామంలోని ఒక వ్యక్తితో మాట్లా డుతూ హఠాత్తుగా పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాదులోని యశోద హాస్పిటల్ కు తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ప్ర‌క‌టించారని కుటుంv సభ్యులు తెలిపారు. కాటంరాజు అకాల మృతి పట్ల గ్రామ ప్రజలు అశోక సము ద్రంలో మునిగిపోయారు. భార్య, ఇద్దరు పిల్లలను అనాథలను చేసిండని ఎన్నికల్లో సర్పంచ్ గా నిలబడి ఓట్ల కోసం లక్షల రూపాయలు అప్పులు చేసిండని గ్రామస్తులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page