కాంగ్రెస్‌ ‌పార్టీవి మోసపూరిత విధానాలు

– బీసీ రిజర్వేషన్లపై కేటీఆర్‌ విమర్శలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌9:  ‌రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ ‌పార్టీ మోసపూరిత విధానాలను ప్రదర్శించిందని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లపాటు అడ్డగోలు విధానాలతో 42 శాతం హామీను నిర్దారించకుండా నిలిపి రేవంత్‌ ‌రెడ్డి బీసీలను దారుణంగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ న్యాయస్థానంలో నిలబడని జీఓ  ద్వారా బీసీలకు హామీ ఇచ్చినట్లు మభ్యపెట్టింది. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కూడా వెన్నుపోటు పొడిచిన నేపథ్యంలో ఎన్నికల సమ‌యంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ ‌మోసాన్నిహైకోర్టు ఆపిందని కేటీఆర్‌ ‌చెప్పారు, కాంగ్రెస్‌ ‌పార్టీ తనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను ఎదుర్కోలేక ఎన్నికల వాయిదా కోసం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ ప్రయోజనానికి వాడుకుంది. ఈ విధానం ద్వారా బీసీలకు చెల్లించాల్సిన హక్కులు దుర్వినియోగం అయ్యాయని విమ‌ర్శించారు. ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవలసిన పరిస్థితిని సృష్టించిన కాంగ్రెస్‌ ‌పార్టీ బీసీలను మోసం చేసిన గుణపాఠాన్ని తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆయన హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page