హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: సమాచార, పౌర సంబంధాల శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న జి.ప్రసాదరావు శుక్రవారం పదవీ విరమణ చేశారు వివిధ హోదాల్లో దాదాపు 41 సంవత్సరాలు పనిచేసిన ఆయన పదవీ విరమణ కార్యక్రమాన్ని సమాచార భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో వివిధ హోదాల్లో పని చేసిన అయన సేవలను సీనియర్ అధికారులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్లు డి.ఎస్ జగన్, డి.శ్రీనివాస్, కె.వెంకటరమణ, డిప్యూటీ డైరెక్టర్లు హాష్మి, వై వెంకటేశ్వర్లు, సురేష్, ఆర్‌ఐఈ జయరాం మూర్తి, తెలంగాణ మాసపత్రిక ఎడిటర్ శాస్త్రిలతోపాటు సమాచార శాఖ అధికారులు, సిబ్బంది, ప్రసాద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు,
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





