విజ్ఞాన వెలుగులతో నిండిన, విద్య భక్తి ఆధ్యాత్మిక చింతనాపరమైన అద్భుతమైన కృతి. వివిధ దేవతా అమూర్తులను స్తుతిస్తూ, విద్యాభ్యాసం, జీవిత విలువలు, ఆధ్యాత్మికత వంటి విషయాలపై అందమైన పద్యాలు వివర్ణాత్మక వర్ణన. అమ్మవారి అనుగ్రహం, సంపద, విద్య, భక్తి, ఆధ్యాత్మిక చింతన వంటి విషయాలపై దృష్టి సారించి పాఠకులకు విజ్ఞాన వెలుగులను నింపే సాహితీ గ్రంధం దసరా పద్యాలు.గాజుల సత్యనారాయణ ఈ పుస్తకం చదివిన తర్వాత మనసు నిండా ఆనందం, శాంతి, మరియు జ్ఞానం నిండిపోతాయి.అమ్మల గన్న యమ్మ, జగజ్జనని కనకదుర్గమ్మ, ఏ దేవి గొల్చి యోగింద్రులు, సిద్ధులు/మహనీయ శక్తి సంపన్నులైరి/ఏ దేవి దర్శన భాగ్యమున/వేచియుందురూ ఋషులు వేల్పులెప్పుడు/ఆ మహా శక్తి కనకదుర్గంబ సతము/అమృత దృక్కుల మిమ్ము కాపాడుగాక! ఈ పద్యాలు అమ్మవారి అద్భుత శక్తి, అందం మరియు కరుణను చక్కగా వర్ణించారు.సిరి సంపదల వర్ణ పద్యంలో, శ్రీమహదేవుడే కొలువుండు గాక మీ ఇంట/మణి మాణిక్యాలతో వర్ధిల్లు యిలలోన/ వర్ధిల్లు మహారాజ వర్ధిల్లయ్య/జయీ భవ! విజయీభవ! దిగ్విజయీ బావ!/పప్పు బెల్లం పద్యంలో,అయ్యవారికి చాలు ఐదు వరహాలు/పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు/జయీ భవ! విజయీభవ! దిగ్విజయీభవ! విద్యాబుద్ధుల పద్యంలో, చదువు చెప్పుట మాకు ఎంత రాజిలు/యీ మహా వర్ణవమికి యాచింప వచ్చితిమి/ ఈ పద్యాలు జీవితంలోని వివిధ అంశాలైన సంపద, సంతోషం, విద్య వంటి వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు.ఆశీర్వచన పద్యంలో, శ్రీరస్తు విజయోస్తు దీర్ఘాయురస్తు /ధన కనక వస్తు వాహనసిద్ధిరస్తు/కారుణ్యముగా మీకు కళ్యాణమస్తు/ దసరా దీవెనల పద్యంలో, సుతులతో సుతులతో సౌఖ్యములు గల్గి/వడుగులను పెండ్లిండ్లు వరుసతో గల్గి/ఏడాది కొక దినము వేడుకతో మేము/పోడిమిగా మిమిట్లు పొగడ వచ్చేదము/ ఈ పద్యాలు పాఠకులకు ఆశీర్వచనాలు అందిస్తూ, మంచి జీవితం గడపాలని కోరుకుంటారు.
ఏకదంతుని పద్యంలో, ఏ కార్తి రూపాయ! ఏకదంతాయ! నాగేశ వరదాయ! నాగభూషాయ! లోకజన భుజితాయ! లోక నేత్రాయ! సదాశివుని పద్యంలో, నందివాహనరుఢ నాగభూషణుడు! ఇందు శేఖరుడు! పార్వతీమనోహరుడు/ లక్ష్మీ నరసింహ పద్యంలో, శ్రీ లక్ష్మీ కరముగా సింహగిరి యందు/శ్రీ లోకనాయకా శ్రిత కల్పవృక్ష/శ్రీహరి కరుణించు సృష్టి రక్షకుడు/ శారదాంబ పద్యంలో, జయ జయ జగదంబ జయ శారదాంబ/జయ జయ అజురాణి జయ నీలవేణి/ పార్వతి దేవి పద్యంలో, సుందరం బైనట్టి సూటి గాజులు ను/దాత గుడగవచ్చు ధన్యులను జయ/శ్రీ పార్వతీ దేవి! శ్రీ శారదాంబ! ఈ పద్యాలు వివిధ దేవతల కథలు, వారి ప్రాముఖ్యతను తెలియజేశారు.సితాఅన్వేషణ పద్యంలో, శ్రీరామ పాదముల్ శిరసావహించి/విశ్వాంభ రాకన్యకా వృత్తాంతమంతా/వినిపించినట్టి యా వీర ప్రతాప/మమ్ము బ్రోచి రక్షించు ఓ ఆంజనేయ జయ/ దశావతార వర్ణన పద్యములో, మహిలోన మమ్మేలు మత్స్యవతార/గురుతుగా కృప చూడు కూర్మావతారా/వరదుడై వర్ధిల్లు వరాహవతార/శిశువును గాంచిన నరసింహావతార/వాక్యమున సిరిగల్గు వామనవతార/బహు బాలాడ్య బలభద్రవతార/బ్రోవనేర్చి నయట్టి బుద్ధవతార/గావ వేమము వేడుక కలికావతార/దివ్య సంపదలో సగు దివ్యవతార/ఘన చెన్నకేశ్వర కరుణా విహార/పరగరాజ మహేంద్ర పట్టణ నిలయ/సేవకుల, రక్షించు, శేషావతార/బాలురను మేలు శ్రీ బాలగోపాల/ దసరా వర్ణ పద్యములో, రాజాధిరాజశ్రీ రాజ మహారాజ! రాజతేజోనిధీ! రాజకందర్ప! ఉభయ విద్యాధుర్య! ఉద్యోగ ధుర్య! వివిధ సద్గుణధామ! విభవాభిరామ, జయ! ఈ పద్యాలు ఆధ్యాత్మికత, జీవితం గురించిన లోతైన ఆలోచనలను కలిగిస్తాయి.విద్యా భక్తి ఆధ్యాత్మిక చింతనాపరమైన పద్యాలు.ఈ పుస్తకంలోని ప్రతి పద్యం కూడా విద్య, భక్తి, ఆధ్యాత్మికత వంటి విషయాలను అద్భుతంగా కలుపుతూ, మనసును నిశ్చలంగా చేస్తుంది.విజ్ఞాన వెలుగులను నింపిన పద్యాలు.
ఈ పద్యాలు పాఠకులకు విజ్ఞానాన్ని అందిస్తూ, జీవితంలోని అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగిస్తాయి.అందమైన భాష పద్యాల భాష చాలా సరళంగా, అందంగా ఉంది. దీంతో ఎవరైనా ఈ పద్యాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు.గాజుల సత్యనారాయణ దసరా పద్యాల పుస్తకం, దసరా పండుగను మరింత ప్రత్యేకంగా చేసే ఒక అద్భుతమైన రచన. ఈ పుస్తకం కేవలం దసరా సందర్భంలో మాత్రమే కాకుండా, జీవితంలోని ప్రతి క్షణంలోనూ మనకు స్ఫూర్తిని ఇస్తుంది. ఈ పుస్తకంలోని పద్యాలను పాఠ్యాంశా లలో పాఠ్యాంశంగా చేర్చడం ద్వారా విద్యార్థులలో భారతీయ సంస్కృతి గురించి అవగాహన పెంపొందించవచ్చు. ఈ పుస్తకం ఆధారంగా ఒక నాటకం లేదా కవిత సంకలనం రూపొందించవచ్చు. ఈ పుస్తకంలోని పద్యాలను సంగీతంతో కలిపి ప్రదర్శించడం ద్వారా దసరా పండుగను మరింత వైభవంగా జరుపుకోవచ్చు. ఈ పుస్తకం భక్తి జ్ఞాన సామాజిక సాథమిక అంశాలపై ఆసక్తి ఉన్న వారందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పుస్తకాన్ని అందరూ తప్పకుండా చదవాలని నా కోరిక. ఈ అద్భుతమైన కృతిని అందించిన గాజుల సత్యనారాయణ కి అభినందనలు తెలియజేస్తూ.
-పూసపాటి వేదాద్రి
9912197694