‘మొoథా’తో 4,47,864  ఎకరాల్లో పంట నష్టం

-వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో అధికం
-వ్యవసాయ శాఖ ప్రాధమిక నివేదిక
– పంట నష్టం వివరాలు వెల్లడి
-పూర్తి స్థాయి సర్వేతో పంట నష్టం పెరగొచ్చు
-నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటాం
– మంత్రి తుమ్మల

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30:  మొoథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టంపై ప్రాథమిక నివేదికను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుద‌ల చేశారు. తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాల్లో 179 మండలాల్లో 2,53,033 మంది రైతులకు చెందిన 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ,పూర్తి స్థాయిలో సర్వే చేశాక పంట నష్టం పెరగొచ్చని మంత్రి తుమ్మల వెల్లడించారు. పంట నష్టం ప్రాధమిక వివరాలు చూస్తే వరి 2,82,379 ఎకరాల్లో పత్తి 1,51,707 ఎకరాల్లో నష్టపోయినట్లు నివేదికలో పేర్కొన్నారు. పంట నష్టం ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.1,30,200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా ,తరువాత స్థానంలో  ఖమ్మం జిల్లా 62,400 ఎకరాల్లో, నల్గొండ జిల్లాలో 52,071 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాధమిక నివేదికలో తెలిపారు.  తుఫాన్ ప్రభావంతో నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు.వరద ప్రభావిత జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తుమ్మల ప్రకటించారు.ఎకరాకు ఎంత పంట నష్ట పరిహారం ఇవ్వాలో సీఎం రేవంత్ రెడ్డి తో చర్చించి నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి తుమ్మల వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page