– గాంధీ ఆలోచనలతో అవతరించింది
– స్వాతంత్య్రం సాధనలో కాంగ్రెస్ పాత్ర అమోఘం : మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : దేశ స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ సేవాదళ్ పాత్ర మరువలేనిదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. కాంగ్రెస్‌ది గాంధీ అహింసా సిద్ధాంతం.. అదే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ సేవాదళ్ కూడా అనుసరిస్తున్నదంటూ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ సేవాదళ్ పార్టీ సిద్ధాంతాల మీద శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కాంగ్రెస్ సేవాదళ్ అంటే దేశభక్తుల సంఘం అని, జిల్లాల్లో కూడా శిక్షణ కార్యక్రమాలు సేవాదళ్ నిర్వహించాలని సూచించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న కాంగ్రెస్ సేవాదళ్ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని సేవాదళ్ కార్యకర్తల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా చరకా పట్టి నూలు వడికారు. సేవాదళ్ కాంగ్రెస్ సిద్ధాంతాలకు శ్రీరామరక్ష అంటూ సిద్ధాంత బలం ఉంటే ఎన్ని కష్టాలు అయినా ఎదుర్కోవచ్చు అని చెప్పారు. పార్టీ త్యాగాలను, త్యాగాల చరిత్రను, పార్టీ గొప్పతనాన్ని ఘనతను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. మీ శిక్షణ కార్యక్రమాలను జిల్లాలకు విస్తరిస్తే మన సైన్యం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. గాంధీ జ్ఞానం నెహ్రుగా నిర్మించిన భారత దేశ విధివిధానాలు, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఈ దేశానికి వెన్నెముక అని తెలిపారు. కానీ రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ¾ భ్రసŸT్ట పట్టిస్తోందని, ప్రజల ఐక్యతను దెబ్బతీసి విద్వేష రాజకీయాలను చేస్తున్నదని విమర్శించారు. గాంధీ చూపిన శాంతి బాటలో మనం విద్వేష రాజకీయాలను గెలవాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించింది కాంగ్రెస్ పార్టీ అని, దేశ ఆత్మను కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందని, ఆ దిశలో రక్షణ దళాలుగా సేవాదళ్ కార్యకర్తలు పని చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





