సుప్రీం తీర్పుతో కాంగ్రెస్‌ తొలి విజయం

– 42శాతం రిజర్వేషన్లను ఎవరూ ఆపలేరు
– బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ప్రజలు నమ్మడం లేదు
– కాంగ్రెస్‌ జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి

జనగామ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని కాంగ్రెస్‌ జనగామ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి స్వాగతించారు. ఇది స్థానిక ఎన్నికల్లో రేవంత్‌ సర్కార్‌ సాధించిన తొలి విజయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ 42శాతం బీసీ కోటాకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చి జీవో కూడా ఇచ్చిందని , బీసీ కోటాపై అన్నీ ఆలోచించే ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని చెప్పారు. అయితే కొందరు కావాలనే కోర్టులకు వెళ్తున్నారన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజల భాగస్వామ్యంతోనే బీసీ కోటా సాధ్యమని సీఎం రేవంత్‌ ఎప్పుడో అన్నారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బిసి లకు రిజర్వేషన్లు ఇచ్చే విశయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తుందని అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌లు బీసీ రిజర్వేషన్లు అమలు కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అతిపెద్ద విజయం సాధించబోతోందని, బీఆర్‌ఎస్‌, బీజేపీలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. బీసీిలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు అమలుకు అన్ని వర్గాలు ప్రభుత్వానికి సహకరించాలని కొమ్మూరి కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page