సినీ కార్మికులకు ప్రభుత్వం అండ

-టిక్కెట్ల రేట్లలో కార్మిక సంక్షేమం కోసం 20శాతం
-ఆరోగ్యశ్రీ, ఇళ్ల స్థలాలు, పిల్లలకు ప్రత్యేక స్కూలు
-ఆస్కార్‌ ‌స్థాయికి సినీ పరిశ్రమను తీసుకెళ్లిన ఘనత దే
-సినీ కార్మిక సంఘం సన్మాన సభలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌28:‌ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ ‌నగరం వేదిక కావాలనేది తన సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సినీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ పోలీస్‌ ‌గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. సినీ కార్మికుల సంక్షేమంపై సీఎం పలు కీలక హాలు ఇచ్చారు. కృష్ణా నగర్‌లో మూడు నుంచి నాలుగు ఎకరాల్లో కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్‌ ‌స్థాయి పాఠశాల నిర్మిస్తాం. ఉదయం టిఫిన్‌, ‌మధ్యాహ్నం లంచ్‌ ‌కూడా అందిస్తాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీతోపాటు ఉచిత వైద్యం కూడా అందిస్తాం అని చెప్పారు. తన మాటకు కట్టుబడి కృష్ణానగర్‌కు వొచ్చానని గుర్తుచేసిన రేవంత్‌ ‌కార్మికుల కోసం ప్రభుత్వం చేయాల్సిన పనులు చేస్తాం. వెల్ఫేర్‌ ‌ఫండ్‌కు రూ.10 కోట్లు ఇస్తున్నాం. కష్టాల్లో ఉన్న కార్మికుల కోసం ఆ నిధులు వినియోగించండని అన్నారు. అంతేకాక సినిమా టికెట్‌ ‌రేట్లు పెంచాలంటే కార్మికులకు 20 శాతం వాటా తప్పనిసరి ఇవ్వాల్సిందేనన్నారు. ఆ వాటా వెల్ఫేర్‌ ‌ఫండ్‌కు బదిలీ అవ్వాలి. లేదంటే టికెట్‌ ‌ధరల పెంపుకు జీ.ఓ. యివ్వ‌మ‌ని స్పష్టం చేశారు. నిర్మాతలు, కార్మికులు కుటుంబ సభ్యుల్లా ఉండాలని సూచించారు. ఫైటర్స్, ‌టెక్నీషియన్ల నైపుణ్యం పెంచేందుకు ఫ్యూచర్‌ ‌సిటీలో భూమి కేటాయిస్తామని తెలిపారు. మీకు అవసరం ఉన్నప్పుడు  అందుబాటులో ఉంటా. ప్రభుత్వం ఎల్లప్పుడూ  వెన్నంటి ఉంటుందని సీఎం రేవంత్‌ ‌రెడ్డి హా ఇచ్చారు.సినీ కార్మికుల శ్రమ నాకు బాగా తెలుసు.  కష్టాలు తెలుసుకోలేనంతగా నా కళ్లూ మూసుకోలేదన్నారు. సినీ పరిశ్రమకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని సీఎం హా ఇచ్చారు. ఒకప్పుడు సినీ పరిశ్రమ అంటే మద్రాసే అనుకునే వారు. కానీ, నేడు తెలుగు సినిమా ఆస్కార్‌ అవార్డుల వరకు వెళ్లగలిగింది. ఈ గౌరవం తెర వెనుక కష్టపడే కార్మికుల శ్రమ ఫలితమే అని రేవంత్‌ అభినందించారు. నిలిచిపోయిన నంది అవార్డులను ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ ‌పేరుతో అవార్డులను ఇస్తున్నామని సీఎం తెలిపారు. హాలీవుడ్‌ ‌కూడా తెలంగాణకు వచ్చి షూటింగ్‌ ‌చేసుకునేలా మారాలి. చిన్న సినిమాలను తక్కువ చేసి చూసే ప్రసక్తే లేదు. ఐటీ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, సినిమా పరిశ్రమకూ అంతే ప్రాధాన్యత ఇస్తాం అని ఆయన అన్నారు. ఐటీ, ఫార్మా పరిశ్రమలు ఎలాగో.. ఫిల్మ్ ఇం‌డస్టీ కూడా అంతే. మీరు అండగా ఉంటే హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తా. హాలీవుడ్‌ ‌సినిమాలు రామోజీ ఫిల్మ్‌సిటీ, హైదరాబాద్‌లో షూటింగ్‌లు జరిగేలా బాధ్యత తీసుకుంటాం.  ప్రభుత్వం చేయగలిగిన పనులు చేస్తాం. సినిమా టికెట్ల పెంపు ద్వారా వచ్చిన ఆదాయంలో 20శాతం కార్మికులకు ఇవ్వాలి. కార్మికులకు లాభాల్లో 20శాతం ఇస్తేనే టికెట్ల ధరలు పెంచుకునేందుకు జీవో ఇస్తాం. త్వరలోనే సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం అని సీఎం తెలిపారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేసినట్లు చెప్పిన సీఎం రేవంత్‌. 1964‌లో నంది అవార్దులను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు.హైదరాబాద్ ‌మీకు సినీ పరిశ్రమ రావడంలో మర్రిచెన్నారెడ్డి పాత్ర కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఎంతో మందిని సంప్రదించి పరిశ్రమను తెచ్చారని గుర్తుచేశారు. డాక్టర్‌ ‌ప్రభాకర్‌ ‌రెడ్డి సినీ కార్మికులను ఆదుకున్నారని.. కార్మికుల కోసం పది ఎకరాలు ఇచ్చారని తెలిపారు. పరిశ్రమను ప్రోత్సహించేందుకు కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు సీఎం. సినీ కార్మికులకు ఉచిత వైద్యం అందిస్తామని హా ఇచ్చారు. కార్యక్రమంలో నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ ‌దిల్‌ ‌రాజు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ‌మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page