భారతదేశంలో క్రీడలకిది ఉత్తేజకరమైన సమయం. భారత్ లో అనాదిగా ఎంతో మంది ప్రతి భావంతులైన క్రీడాకా రులున్నారు. అయితే వాళ్ళ అవసరాలు, ఆకాంక్షలకు తగినట్టుగా ఇప్పుడున్న విధానాలలో కొన్ని మార్పులు, చేర్పు లు అవసరం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం క్రీడారంగ దృశ్యాన్ని సమూలంగా మార్చివేసే కృషిలో భాగంగా క్షేత్రస్థాయిలో ప్రతిభను గుర్తించటం, క్రీడల మౌలిక వసతుల నిర్మాణం, ఉన్నతస్థాయి క్రీడాకారులకు అండగా నిలబడటం మారుమూల ప్రాంతాల్లో ఉన్న మహిళా, దివ్యాంగ, యువ క్రీడాకారులకు కూడా సామాన్య అవకాశాలు కల్పించటం మీద దృష్ట సారించింది. అన్ని వయోవర్గాల క్రీడాకారుల విజయ గాథలు, వారు ఎదుర్కున్న కష్టాలు, సలిపిన పోరు గురించి ‘మన్ కి బాత్ ‘ లో ప్రధాని చెప్పటంతో ఆ క్రీడాకారులు దేశ ప్రజల గుండెల్లో స్థానం పొందగలిగారు. ఖేలో ఇండియా ఒక కీలకమైన మార్పుకు చిహ్నం. నిజం చెప్పాలంటే ఖేలో ఇండియా క్రీడలు భారతదేశానికి మినీ ఒలంపిక్స్ లాంటివి. అలా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందటమన్నది యువ ఆటగాళ్లకు ప్రేరణగా మారటమే కాకుండా ఆయా రాష్ట్రాలు కూడా అత్యాధునిక క్రీడా సౌకర్యాలు కల్పించుకోవటాన్ని ప్రోత్సహించింది. దేశమంతటా క్రీడల సంస్కృతి అభివృద్ధిచెందటంతోబాటు ప్రతి క్రీడాకారుడి గురించి, పురోగతి గురించి స్వయంగా తెలుసుకోవటంలో ప్రధాని ఆసక్తి చూపటం ఇంతకు ముందెన్నడూ కనీవినీ ఎరుగనిది. అంతర్జాతీయ పోటీలకు వెళ్ళేటప్పుడు భారత జట్టుకు వీడ్కోలు చెప్పటం, వాళ్ళలో ఉత్సాహం నింపటం, విజయవంతంగా తిరిగివచ్చినప్పుడు వాళ్ళ కృషిని అభినందించటం ఆయన కచ్చితంగా అనుసరించే పద్ధతి.
ప్రధాని తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్ ‘ లో కూడా క్రీడకారుల గురించి చాలా ఎక్కువగా మాట్లాడతారు. ఇదివరకు మన దేశంలో క్రీడాకారులు సాధించిన విజయాల గురించి ఏలాంటి సమాచారం కావాలన్న పత్రికలు మాత్రమే ఏకైక మాధ్యమం. కానీ, ఇప్పుడు వారు ఏ అంతర్జాతీయ క్రీడలకు వెళుతున్నా, బయలుదేరుతున్నప్పుడే వేడుక జరుపు కుంటున్నాం. కామన్వెల్త్ క్రీడలు కావచ్చు, ఒలంపిక్స్ కు వెళ్ళే భారత బృందం కావచ్చు, ఖేలో ఇండియా క్రీడలలో పాల్గొనే యువత కావచ్చు .. క్రీడారంగంలో సాధించిన విజయాలను వెలుగులోకి తెచ్చే వేదికగా ‘మన్ కీ బాత్’ తయారైంది. ఇప్పుడు 2023 ఏప్రిల్ 30 న మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ చేరుకుంటోంది. ఈ ఎపిసోడ్స్ అన్నీ ఇన్నేళ్ళుగా సాగుతూ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగానూ, వాళ్ళు తమ ప్రతిభకు సానపెట్టి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించటానికి స్ఫూర్తిమ ంతంగానూ నిలిచాయి.
నేను ప్రపవంచ ఛాంపియన్ షిప్ లో తొలి పతకం గెలిచినప్పుడు, ఇతర పతకాలు సాధించిన నా సహ క్రీడాకారిణులను వారి దేశాధినేత ఫోన్ ద్వారా అభినందిస్తుంటే దాన్ని స్టేడియం తెరల మీద ప్రదర్శించారు. నాకు అలాంటి అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని అనుకునేదాన్ని. అలా చూసినప్పుడు ఈనాటి క్రీడాకారులు ఎంతో అదృష్టవంతులనే చెప్పాలి. అలాంటి క్రీడాకారుల విజయం గురించి ప్రధాని ‘మన్ కీ బాత్‘ లాంటి ముఖ్యమైన వేదికలో మాట్లాడుతున్నారు. వాళ్ళ వ్యక్తిగత ఇష్టాలు కూడా ఆయనకు తెలుసు గనుక వెళ్ళేటప్పుడు ఘనంగా వీడ్కోలు పాలకటంతోబాటు తిరిగివచ్చాక సత్కరి స్తున్నారు. యావత్ భారతదేశం, మరీ ముఖ్యంగా యువతరం దీన్ని గమనిస్తోంది. ప్రధాని పదే పదే చెబుతూ ఉంటారు – క్రీడలు కేవలం పతకాలు గెలిచి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలపటంతో ఆగిపోవని. అంతిమంగా జరగాల్సింది శారీరకంగా ఫిట్ గా ఉండటం, మానసిక అప్రమత్తత, క్రీడా స్ఫూర్తిని పెంచుకోవటం, తద్వారా వ్యక్తిత్వ అభివృద్ధి అని చెబుతారు. మొత్తంగా క్రీడలు అనేవి దేశాభివృద్ధికి చాలా ముఖ్యమైనవి. . ప్రజలు కేవలం క్రికెట్ ను మాత్రమే అభిమానించే రోజులు పోయాయి. ప్రతి అంతర్జాతీయ క్రీడాంశంలోనూ పాల్గొనటంలో దేశం ఎంతగానో గర్విస్తోంది. అది బాడ్మింటన్ కావచ్చు, జావెలిన్ త్రో కావచ్చు, హాండ్ బాల్ , ఫెన్సింగ్.. చివరికి స్వదేశీ క్రీడలైన మల్లఖంబ్, కలిరియపయట్టు కావచ్చు, ప్రపంచ మంతటా త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తున్న ఆ క్రీడాకారుణ్ణి ప్రజలు కలసికట్టుగా అభినందిస్తున్నారు.
2020 ఒలంపిక్స్ కు ముందు టోక్యో వెళుతున్న క్రీడాకారుల బృందానికి #Cheer4India తో శుభాకాంక్షలు చెప్పాలని ప్రధాని ‘మన్ కీ బాత్’ శ్రోతలను కోరారు. ఆ తరువాత అదొక ప్రచార ఉద్యమంగా తయారై పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని క్రీడాకారులను శుభాకాంక్షలు చెప్పటం చూశాం. మన క్రీడాకారులను అభినందించి ప్రోత్సహించటంలో ఒక జాతిగా మనం రకరకాల పద్ధతులు పాటించటం ఆసక్తికరంగా ఉంది. భారత క్రీడారంగంలో ఈ విధమైన వేగం ఇంతకు ముందెన్నడూ కనీవినీ ఎరుగనిది. క్రీడలకు పునరుత్తేజం కల్పించిన ప్రధానికి నా ధన్యవాదాలు. ఈ ప్రోత్సాహకాపు ఫలితాలు మన కళ్ళెదుటే ఉన్నాయి. టోక్యో ఒలంపిక్స్ లో 7 పతకాలు, పారాలింపిక్స్ లో 19 సాధించాం. గత నాలుగుదశాబ్దాలలో భారత్ ఇలాంటి ఘనత సాధించలేదు. 22 స్వర్ణాలు సహా మొత్తం 61 పతకాలు సాధించి బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ అత్యుత్తమ ప్రతిభ కనబరచింది. చరిత్రలో మొట్టమొదటి సారిగా, ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ థామస్ కప్ ( బాడ్మింటన్) టోర్నమెంట్ లో భారత పురుషుల జట్టు 14 సార్లు విశ్వ విజేత అయిన ఇండొనేసియాను ఓడించి ఛాంపియన్ షిప్ సాధించింది. బ్రెజిల్ లో జరిగిన డెఫ్ లింపిక్స్ లో భారత బృందం అత్యుత్తమ ప్రతిభ కనబరచి 16 పతకాలు సాధించింది. ప్రతిభావంతులైన యువ క్రీడాకారులు అద్భుతమైన క్రీడాస్ఫూర్తి ప్రదర్శిస్తూ ఉండగా యావత్ దేశం వారి విజయాలను ఆస్వాదిస్తోంది. ‘మన్ కీ బాత్’ ఒక వేదికగా దేశ పౌరులలో స్ఫూర్తి నింపింది. ముఖ్యంగా యువతలో సామూహిక ఉత్సాహం నింపి క్రీడల పట్ల ఆసక్తి పెంచింది. అనేక ఎపిసోడ్స్ లో ప్రధాని నేరుగా యువతకు పిలుపునిస్తూ, క్రీడలను వారి జీవితాల్లో కీలకమైన భాగం చేసుకోవాలని కోరారు. తన రేడియో కార్యక్రమం ద్వారా ‘సబ్ కా ప్రయాస్’ భావనను నింపి భారత సమగ్రాభివృద్ధిలో క్రీడలను భాగం చేశారు. దీంతో ప్రజలు, ప్రభుత్వం, క్రీడాకారులు, క్రీడా సంఘాలు ఉమ్మడిగా ఈ నవ భారత దార్శనికతను సాకారం చేయటానికి కృషి చేస్తున్నారు. మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ కోసం నేను ఎదురు చూస్తున్నా. ఇతరుల జీవితాలలో పెను మార్పులకు కారకులైన సామాన్య ప్రజల గురించి మాట్లాడుతూ స్ఫూర్తి నింపి, ప్రోత్సహించే మన ప్రధాని మాటల కోసం వేచి చూస్తున్నా.
అంజు బాబీ జార్జ్,
భారత ఒలంపిక్ క్రీడాకారిణి,
భారత అథ్లెటిక్ సమాఖ్య
ఉపాధ్యక్షురాలు
భారత ఒలంపిక్ క్రీడాకారిణి,
భారత అథ్లెటిక్ సమాఖ్య
ఉపాధ్యక్షురాలు