– 9న ‘చలో బస్ భవన్’కు బీఆర్‌ఎస్ పిలుపు
-హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 9న చలో బస్ భవన్‌కు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చార్జీల పెంపుతో పేదలపై భారం పడుతుందని పేర్కొన్నారు. ‘చలో బస్ భవన్’లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్‌ఎస్ నేతలు పాల్గొంటారని తెలిపారు. నందినగర్ నుంచి కేటీఆర్, మెహిదీపట్నం నుంచి హరీష్ రావు బస్సులో ప్రయాణం చేసి బస్ భవన్‌కు చేరుకుంటారని చెప్పారు. పెంచిన బస్సు చార్జీలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం అంటూనే వాళ్ల కుటుంబ సభ్యులపై భారం వేయడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చాక ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువేనన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా చెప్పిందని గుర్తు చేశారు. గౌలిగూడ బస్ డిపోను రూ.400కోట్లకు ప్రైవేట్ వాళ్లకుి ఇచ్చారని ఆరోపించారు. మియాపూర్, ఉప్పల్ సహా వివిధ డిపోలను ప్రైవేటీకరణ చేయబోతున్నారని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసి కార్మికులను ముంచాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చూస్తోందని ధ్వజమెత్తారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను స్వాగతిస్తున్నామని, కానీ ఆర్టీసీ డ్రైవర్లతోనే వాటిని నడపాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాలు నడపడానికి ఆర్టీసీ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలనిం సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





