-మలక్కా జలసంధికి అతిసమీపంలో జీఎన్‌ఐ ప్రాజెక్టు
న్యూదిల్లీ,జూన్9: గ్రేట్ నికోబార్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం అనుమతులు ఇచ్చింది. రూ.13వేల కోట్లతో పౌర-సైనిక విమానాశ్రయాన్ని నిర్మించనుంది. ఐఎన్‌ఎస్ బాజ్ వద్ద ఇప్పటికే ఉన్న నావికాదళ విమానాశ్రయాన్ని విస్తరించే ఆలోచనను పక్కనపెట్టింది. పర్యావరణపరంగా వైవిధ్యమైన ద్వీపంలో రూ.81వేల కోట్లతో ప్రకటించిన గ్రేట్ నికోబార్ ఐలాండ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఇప్పటికే రాజకీయ దుమారం రేపుతోంది. ఈక్రమంలోనే ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం గమనార్హం. పౌర, సైనిక అవసరాలు తీరేలా గలాథియా బే సమీపంలోని చింగెన్ వద్ద ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. భౌగోళిక పరిమితుల వల్ల ఇప్పటికే ఉన్న ఐఎన్‌ఎస్ బాజ్ ఎయిర్‌స్టేషన్ వద్ద రన్‌వేను విస్తరించేందుకు దీర్ఘకాలికంగా ఉన్న ప్రణాళికను పక్కనపెట్టాల్సి వచ్చింది. రానున్న ఐదేళ్లలో దీని నిర్మాణం పూర్తికావొచ్చని సమాచారం. నికోబార్ దీవి మలక్కా జలసంధికి అతిసపంలో ఉండటంతో జీఎన్‌ఐ ప్రాజెక్టు వ్యూహాత్మక ప్రాధాన్యం సంతరించుకుందని రక్షణరంగ వర్గాలు వివరించాయి. జలసంధికి సపంలోనే యుద్ధ నౌకలు, వైమానిక సదుపాయాలు ఉండటం నిఘాకు ఎంతో కీలకం కానుందన్నాయి. చైనాకు చెందిన 80 శాతం చమురు, 70 శాతం సహజవాయువు మలక్కా జలసంధి దుగా రవాణా అవుతుందని వెల్లడించాయి.రూ.81వేల కోట్ల గ్రేట్ నికోబార్ ఐలాండ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద తలపెట్టిన మౌలిక సదుపాయాల్లో ఎయిర్‌పోర్ట్ ఒకటి. అండమాన్ నికోబార్ ఐలాండ్‌ను ఆర్థిక, వ్యూహాత్మక హబ్‌గా మార్చే లక్ష్యంతో కేంద్రం ఈ ప్రాజెక్ట్‌ను ముందుకుతీసుకువచ్చింది. ఈ ప్రాజెక్టును విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇది దేశ సహజ, గిరిజన వారసత్వ సంపదకు వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల 160 చదరపు కిలోటర్ల మేర లక్షల చెట్లను నరికివేయాల్సి వస్తుందని, ఇది అభివృద్ధి అనే ముసుగులో జరుగుతున్న విధ్వంసమని మండిపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




