Category Uncategorized

చిల్కానగర్ లో ఆగ్రా స్వీట్ హౌస్ ప్రారంభం

ఉప్పల్,  ప్రజాతంత్ర,  జూలై 19: వ్యాపారంలో బాగా రాణించి ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. బుధవారం ఉప్పల్ నియోజకవర్గంలోని చిల్కానగర్ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆగ్రా స్వీట్ హౌస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బండారి లక్ష్మారెడ్డి లు హాజరై ప్రారంభించారు. ఈ…

భదాద్రి వద్ద గోదావరి పరవళ్ళు

35 అడుగులకు చేరుకున్న నీటిమట్టం – మరింత పెరిగే అవకాశం ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్‌ ‌ప్రియాంక అలా పునరావాస కేంద్రాలు పరిశీలన – అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశం భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 19 : గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. బుధవారం ఉదయం…

ప్రజా సమస్యల పరిష్కారానికే బిజెపి భరోసా యాత్ర

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, జులై 19 : బాలానగర్ డివిజన్ పరిధిలోని నవజీవన్ నగర్ విఘ్నేశ్వర ఆలయంలో బుధవారం వడ్డేపల్లి రాజేశ్వరరావు స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించి, కోమటి బస్తీ నుంచి గడప గడపకు నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల సేవా సుపరిపాలన గురించి తెలియజేస్తూ 42వ రోజు ఇంటింటికి బిజెపి భరోసా యాత్రను…

విద్యార్థులు పుస్తక పఠనాన్ని పెంపొందించుకోవాలి

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్ ప్రతినిధి,జూలై 19 : చేవెళ్ల మండల పరిధిలోని అంతారం ఎంపీపీఎస్ (మండల పరిషత్‌ పాఠశాల)ను స్కూల్‌ కాంప్లెక్స్​​‍ హెడ్‌ మాస్టర్‌ శంకరయ్య బుధవారం సందర్శించారు.తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ఆయన పాఠశాలలోని తరగది గదులకు వెళ్లి విద్యార్థులతో పుస్తక పఠనం చేయించి ప్రశంసించారు.అనంతరం మధ్యాహ్నభోజనాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా స్కూల్‌ కాంప్లెక్స్​​‍ హెడ్‌ మాస్టర్‌…

ఎస్ఐ కుటుంబానికి ఆర్థిక సాయం.. కుటుంబ సభ్యులకు చెక్కు అందించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

సైబరాబాద్, ప్రజాతంత్ర, జులై19 : దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న బొక్క ప్రభాకర్ రెడ్డి జూన్ 8వ,2023న గుండెపోటు తో మరణించారు. కాగా 2014 బ్యాచ్ కు చెందిన ప్రభాకర్ రెడ్డి గతంలో దారూర్, యాలాల్, తాండూర్, కొడంగల్ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. ఆయనకు భార్య, కూతురు అక్షయ ఉన్నారు.…

పటాన్ చెరు డీఎస్పీగా పురుషోత్తం రెడ్డి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, జూలై 19 : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు డీఎస్పీగా పురుషోత్తం రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. వనస్థలిపురం డీఎస్పీగా పనిచేసిన పురుషోత్తం రెడ్డి రాష్ట్రవ్యాప్త బదిలీల్లో భాగంగా పటాన్ చెరు డీఎస్పీగా బదిలీపై వచ్చారు. పటాన్ చెరు డీఎస్పీగా ఇప్పటివరకు పనిచేసిన భీమ్ రెడ్డి హైదరాబాద్ చీఫ్ ఆఫీస్ కు రిపోర్ట్…

గ్రామ పంచాయతీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి : సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్ ప్రతినిధి, జూలై 19: మొయినాబాద్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె 14వ రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా అల్లి దేవేందర్ మాట్లాడుతూ నిన్నటి నుండి జోరు వర్షం కురుస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు సమ్మెలో పాల్గొంటూ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ తమ హక్కుల సాధన కోసం కృషి చేస్తున్నారని అన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి…

స్విమ్మింగ్ పూల్ ను తలపిస్తున్న సిద్ధిపేట రోడ్లు.. పట్టించుకోని మున్సిపల్ పాలకవర్గం : సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 19:  సిద్దిపేటలో కురుస్తున్న వర్షానికి పట్టణంలోని మెయిన్ రోడ్లు సిమ్మింగ్ పూల్ తలపించేలా మారాయని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్దిపేటలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలో చిన్నపాటి వర్షం పడిన మెయిన్ రోడ్లు చౌరస్తాలలో వర్షపు నీరు నిలిచిపోతుందని అన్నారు. సిద్దిపేట…

తీస్తా సెతల్వాద్‌కు సుప్రీంకోర్టు  బెయిల్ మంజూరు

2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులో కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు సుప్రీంకోర్టు  బెయిల్ మంజూరు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులను ఇరికించేందుకు కల్పిత పత్రాలను రూపొందించినట్లు సెతల్వాద్‌పై ఆరోపణలు వచ్చాయి. ఆమె రెగ్యులర్ బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిన గుజరాత్ హైకోర్టు “వెంటనే లొంగిపోవాలని” ఆదేశించింది.ఆ ఆదేశాన్ని అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసి, కొట్టివేసింది