Category Uncategorized

కనుల పండువగా జరిగిన ‘ఆండాళ్’ తిరునక్షత్ర మహోత్సవం

వనస్థలిపురం, ప్రజాతంత్ర జూలై 22: కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించిన గోదాదేవి తిరునక్షత్ర మహోత్సవం శనివారం కనుల పండువ గా జరిగింది. శ్రీరంగం, శ్రీవల్లి పుత్తూరు, శంషాబాద్ దివ్య సాకేతం, భద్రాచలం తదితర ఆలయాల్లో ఆండాళ్ పుట్టినరోజు పండుగ వైభవంగా జరిగింది. వనస్థలిపురం వికాస తరంగిణి ఆధ్వర్యంలో సామూహిక విష్ణు పారాయణం జరిగింది. గోదాదేవి విగ్రహాలకు తులసీమాలలు…

వేదికపై రాళ్ల వర్షం కురిసిన జంకని సింహంవలే గర్జించిన కవితాచార్యుడు

నేడు  దాశరథి కృష్ణమాచార్య  జయంతి 1944లో ఓరుగల్లు జిల్లాలో  ఆంధస్రారస్వత పరిషత్తు ప్రథమ  వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కవులు, కళాకారులు కవి సమ్మేళనం జరపడానికి పూనుకున్నారు. కవి సమ్మేళనం జరుగుతున్న విషయాన్ని నాటి రజాకారులు పసిగట్టారు. సమ్మేళనాన్ని ఆపేందుకు వ్యూహం పన్నారు. దాశరథి, దేవులపల్లి రామానుజరావు, సురవరం ప్రతాపరెడ్డి , తెలుగు భాషా సంరక్షకులు,…

‌సిగ్గు పడుదామా..

‘‘కుకి తెగకు చెందిన ఇద్దరు గిరిజన యువతుల్ని నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన దారుణమైన ఘటన మానవత్వం వాదులను ప్రజాస్వామిక వాదులను కలచివేసింది. ఫాసిజాన్ని అమలు చేసే క్రమంలో కుకి గ్రామంపై ఆ  మూకలు కన్ను వేశారు.మహిళలను బలవంతంగా పట్టపగలు రెండు కిలోమీటర్లు నగ్నంగా నడిపించుకుంటూ గ్రామానికి తీసుకొని పోయి అత్యంత…

సత్యానికి గెలుపన్నది సత్యంరా మానవుడా..! ప్రజాకవి దాశరథి

‘‘నావియక్సు కిరణాల  కళ్ళేమో – నాకేం తెలుసు, లోకమా ? కంటికి కనిపించిందంతా కైతగా రాసేస్తున్నాను’’ అన్న మహాకవి దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న తెలంగాణలోని వరంగల్‌ ‌జిల్లా చిన్న గూడూరు (ఈ గ్రామమిప్పుడు మహబూబాబాద్‌ ‌జిల్లాలో ఉంది) గ్రామంలో జన్మించాడు.  చిన్నతనంలోనే పద్యాలు అల్లడం నేర్చిన ఈ కవి, రచయిత నిజాం ప్రభువును…

మొన్న విద్యుత్‌..‌ నిన్న డబుల్‌ ‌బెడ్‌రూమ్‌ ‌బిఆర్‌ఎస్‌ ‌వెంటపడిన రెండు జాతీయ పార్టీలు

తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఒక విధంగా యుద్ధ వాతావరణం చోటు చేసుకుంటుంది. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రానుండడంతో ఆయా పార్టీలు మాటల దాడులు తీవ్రతరం చేస్తున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్‌ ‌పార్టీ విద్యుత్‌ ‌విషయాన్ని తీసుకుని పెద్ద రభస చేసింది. వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామంటూ రాష్ట్ర…

నగ్నంగా నడిచింది దేహం కాదు…..అది దేశం..

యుగాలు దాటొచ్చిన మనిషిని మృగాలుగా మార్చింది ఎవ్వడు ? పాలిచ్చిన అమ్మల రొమ్ములను బరి తెగించి ఊరేగించిన ఉన్మాదానికి ఊతమిచ్చింది ఎవ్వడు ? వేట కుక్కల్ని ఉసి గొల్పింది ఎవ్వడు ? విద్వేషాన్ని రక్త నాళాలలోకి ఎక్కించింది ఎవ్వడు? తల్లుల జననాంగాల మీద తాండవమాడిన గాడిద కొడుకులను కని పెంచింది ఎవ్వడు ? నెత్తురుని మరిగించింది…

తగ్గుముఖం పట్టిన గోదావరి

భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 21 : భద్రాచలం వద్ద గత నాలుగు రోజులుగా వేగంగా పెరిగిన గోదావరి శుక్రవారం మధ్యాహ్నం నుండి కాస్త తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఉదయం నాటికి 44.9 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 40.1 అడుగులకు చేరుకుంది. గోదావరి తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేసారు. గోదావరి…

ఎం‌ప్లాయిమెంట్‌ ‌ఫ్రెండ్లీ ప్రభుత్వం..

పకడ్బందీగా ఎంప్లాయ్‌ ‌హెల్త్ ‌స్కీమ్‌ ‌మంత్రి హరీష్‌ ‌రావును కలిసిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 21 : దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయ్‌ ‌ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఖ్యాతి గడించిందని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ఉద్యోగులు పింఛనర్ల అన్ని రకాల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సిద్ధంగా…

వోటు హక్కును సక్రమంగా వినియోగించుకొవాలి

ఇవిఎంపై విస్తృతంగా అవగాహన రాష్ట్ర సిఇఓ ఆదేశాల మేరకు కార్యక్రమాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 21 : నగర వోటర్లు తమ వోటు హక్కును సక్రమంగా వినియోగించుకొనుటకు ఎలక్ట్రానిక్‌ ‌వోటింగ్‌ ‌మిషన్‌(ఈవిఎం), వోటర్‌ ‌వెరిఫికేషన్‌ ‌పేపర్‌ ఆడిట్‌ ‌ట్రయల్‌(‌వివి ప్యాట్‌)‌లపై నియోజకవర్గ స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు హైదరాబాద్‌…