Category Uncategorized

బెంగళూరు హోటళ్లలో టిఫిన్‌ ‌రేట్లు పెంపు

బెంగళూరు, జులై 25 : నిత్యావసర వస్తువుల ధరలు అకాశాన్నంటడంతో టిఫిన్‌  ‌ధరలను 10 శాతం మేరకు పెంచాలని బృహత్‌ ‌బెంగళూరు హోటళ్ల సంఘం నిర్ణయించింది. సంఘం గౌరవ కార్యదర్శి వీరేంద్ర కామత్‌ ఈ ‌మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే బియ్యం, కూరగాయల ధరలు బాగా పెరిగాయని, వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌…

తుంగభద్రకు పెరిగిన ఇన్‌ఫ్లో

బళ్లారి, జులై 25 : ఆంధ్ర, కర్ణాటక రైతుల జీవనాడి తుంగభద్ర జలాశయం లోకి సోమవారం మరో నాలుగు టీఎంసీల నీరు చేరింది. తుంగభద్ర పరీ వాహక ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ఇన్‌ ‌ఫ్లో 64వేల క్యూసెక్కులకు పెరిగింది. తుంగ జలాశయం నిండగా, తుంగనుంచి ఇన్‌ఫ్లో  వచ్చి చేరడంతో మరో వారంలోగా రిజర్వాయర్‌…

50 సార్లు రక్తదానం చేసిన యువకుడు

. రక్తదానం చేయండి – ప్రాణాలను కాపాడండి హరితహారం లో మొక్కలు నాటండి – పర్యావరణాన్ని పరిరక్షించండి టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు  లాయక్ పాషా   వేములవాడ పట్టణానికి చెందిన మహమ్మద్ నయీముద్దీన్ అనే యువకుడు 50 సార్లు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. ఇప్పటివరకు 49 సార్లు రక్తదానం చేసి మంగళ వారం  జర్నలిస్ట్ …

మా జీవాలను చల్లంగా చూడు ముత్యాలమ్మ తల్లి

ఆమనగల్లు, ప్రజాతంత్ర జూలై 25 : మండలంలోని మేడిగడ్డ తండాలో శీతల పండుగ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తాండ సమీపంలో పూజలు నిర్వహించారు. మా మూగ జీవాలను ముత్యాలమ్మ తల్లి చల్లంగా చూడాలని వేడుకున్నారు. అనంతరం అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అమర్ సింగ్,…

ప్రారంభోత్సవానికి సిద్ధమైన మీడియా అకాడమీ భవనం

చాపల్ రోడ్డు,నాంపల్లి లో ఉన్న పాత ప్రెస్ అకాడమీ స్థానంలో నిర్మించిన  మీడియా అకాడమీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వేయి గజాల స్థలంలో నాలుగు అంతస్తుల్లో  29548 చదరపు అడుగుల్లో కార్పొరేట్ భవనంలా నిర్మించారు . ముఖ్యమంత్రి కెసిఆర్ పాత అకాడమీ భవనం లో ఫిబ్రవరి 2015లో జరిగిన అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో కొత్త…

మంత్రి హరీష్ రావు ఆశీస్సులు తీసుకున్న ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 25 : సిద్దిపేట జిల్లా ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆశీస్సులు తీసుకున్నారు. మంగళవారం ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంత్రి హరీష్ రావును మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. పూల…

విఆర్‌ఎ ‌లు ఇక నుంచి పే స్కేల్‌ ఉద్యోగులు

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 24 : ఫ్యూడల్‌ ‌వ్యవస్థకు అవశేషంగా, ప్రజాకంటకంగా విఆర్‌ఏ ‌వ్యవస్థ కొనసాగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు. గ్రామాల్లో తరతరాలుగా, అతి తక్కువ జీతంతో రైతుల కల్లాల దగ్గర దానం అడుక్కునే పద్ధతిలో ఎన్నో తరాలుగా వీరంతా పనిచేస్తూ వచ్చారని సీఎం తెలిపారు. మహారాష్ట్రలో కూడా…

మణిపూర్‌ అం‌శంపై అట్టుడికిన పార్లమెంట్‌

న్యూ దిల్లీ, జులై 24 : మణిపూర్‌ ఉదంతంపై సోమావారం కూడా పార్లమెంట్‌ ఉభయసభలు అట్టుడికిపోయాయి. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మణిపూర్‌ అం‌శంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్‌ ‌చేశాయి. పార్లమెంటులో విపక్షాల నిరసనతో గందరగోళం నెలకొనడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఈ…

ఆగస్టులో 14 రోజులు బ్యాంకులకు సెలవు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 24 : వొచ్చే ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉన్నాయి. ఆర్బీఐ క్యాలెండర్‌ ‌ప్రకారం ఆగస్టులో పండుగలు, పర్వదినాలు, వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక దినోత్సవాలతోపాటు రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలను కలుపుకొంటే 14 రోజులు బ్యాంకులు బంద్‌. ‌ కాబట్టి వొచ్చే నెలలో…