Category తెలంగాణ

రైల్వే వసతుల కల్పనకు పెద్దపీట

సికింద్రాబాద్‌-జోథ్‌పూర్‌ రైలు ప్రారంభోత్సవంలో కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే కరీంనగర్‌, వరంగల్‌, బేగంపేట స్టేషన్లు అభివృద్ధి చేసి ప్రారంభించామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి…

సంచార సహాయ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: రాష్ట్రంలోని వలసదారుల, బలహీన వర్గాల సంక్షేమాభివృద్ధికి, వారి జీవనోపాధి అవకాశాలు పెంచేందుకు మద్దతుగా మొబైల్‌ వలస సహాయ కేంద్రాన్ని (ఎంఎంఆర్‌సీ) వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌లో శనివారం ప్రారంభించారు. దీనిని ఐక్యరాజ్య సమితి(యూఎన్‌వో)కి చెందిన అంతర్జాతీయ వలస సంస్థ (ఐఓఎం), ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఏవో) సంయుక్త కార్యాచరణగా…

ఆదాయం పెంపుపై దృష్టి సారించాలి

– ఆర్థిక సంఘం చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య – ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల అధికారులతో సమీక్ష నిజామాబాద్‌ జూలై 19 : స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య సూచించారు.…

గద్దెల్లో మార్పుల్లేకుండా ఆధునికీకరించాలి

పూజారుల అభిప్రాయాలు, భక్తుల అవసరాలకే పెద్దపీట మేడారంలో పనులపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: గిరిజన మహా జాతర జరిగే ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గద్దెల్లో ఎలాంటి మార్పులు చేయకుండా పూజారుల సూచనల మేరకు భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో ఆధునీకరణ పనులు చేపట్టాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి…

రెండోరోజూ వలుచోట్ల భారీ వర్షం

పలు ప్రాంతాలు జలమయం.. ట్రాఫిక్‌ జాంజాటాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: భాగ్యనగరంలో రెండోరోజు శనివారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం కూడా భారీ వర్షం పడడంతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్న విషయం విదితమే. జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, బాలానగర్‌, బోయినపల్లి, ఆల్వాల్‌, మల్కాజ్‌గిరి, మౌలాలి, బేగంపేట్‌, మలక్‌పేట్‌, చార్మినార్‌, ముషీరాబాద్‌, అబిడ్స్‌,…

ఉస్మానియా వైద్యులు ఆదర్శనీయులు

బాలికకు పునర్జన్మ ప్రసాదించినందుకు సీఎం అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: కాలేయం పూర్తిగా చెడిపోయి కోమాలోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పదిహేనేళ్ల బాలికకు ఉస్మానియా హాస్పిటల్‌ వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తిచేశారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌కు చెందిన బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతున్న బ్లెస్సీ గౌడ్‌ అనే బాలికకు మరు జన్మను…

రైతుల అవసరాల మేరకే యూరియా పంపిణీ

వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ గోపి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: యూరియా పంపిణీ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, రైతుల అవసరాల మేరకే పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.గోపి అధికారులకు సూచించారు. యూరియా, ఇతర ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, ఎవరైనా డీలర్లు, వ్యాపారస్తులు ఎక్కువ మొత్తంలో నిల్వలు చేసి బ్లాక్‌…

జోరుగా ‘పచ్చదనం’ పండగ

– ఉత్సవాన్ని తలపిస్తున్న వన మహోత్సవం – ఇప్పటివరకు 1.70 కోట్ల మొక్కలు నాటిన పంచాయతీ, గ్రామీణాభివృద్ది శాఖ – మంత్రి సీతక్క నేతృత్వంలో ఊపందుకున్న కార్యక్రమం హైదరాబాద్‌, జూలై 19: రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏటా ప్రతిష్టాత్మకంగా చేపట్టే వనమహోత్సవ కార్యక్రమం పల్లెల్లో జోరుగా సాగుతోంది. గత ఏడాది 6…

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

అధికారులకు సీఎం ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: హైదరాబాద్‌లో భారీ వర్షం నేపథ్యంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండిఏ, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్‌, పోలీస్‌ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు…