Category తెలంగాణ

మామునూరు ఎయిర్‌పోర్టులో కదలిక

–  భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై25: వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఎయిర్‌పోర్టు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.205 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే భూములు కేటాయించలేదని ఆరోపణలు వచ్చాయి. మామునూరు వద్ద కొత్త బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి…

చిత్తశుద్ది ఉంటే బిసి బిల్లు ఆమోదింపచేయండి

–  బిజెపి నేతలకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ‌సవాల్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై25: బీజేపీ అగ్రకుల పార్టీ అని, బీసీ బిల్లుకు ఆమోదం తెలపకుండా ఆ పార్టీ నేతలు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆక్షేపించారు. బిసిలపై చిత్తశుద్ది ఉంటే వెంటనే బిల్లును ఆమోదించేలా ఒత్తిడి తేవాలన్నారు. బిల్లును ఆమోదించాలని కేంద్రం, భాజపా…

కేబినేట్‌ ‌భేటీ వాయిదా

– 28న జరపాలని సిఎం నిర్ణయం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై25: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25వ తేదీ శుక్రవారం జరగాల్సిన కేబినెట్‌ ‌భేటీ వాయిదా పడింది.  ఐదుగురు మంత్రులు దిల్లీలో ఉండటంతో తాత్కాలికంగా నిలిపివేశారు. తాజా నిర్ణయం ప్రకారం, మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 28వ…

టెక్స్‌టైల్‌ రంగంలో పెట్టుబడులు పెట్టండి

– ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అపార అవకాశాలు – తైవాన్‌ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ రంగం అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టి రైజింగ్‌ తెలంగాణలో భాగస్వామ్యం కావాలని తైవాన్‌ పారిశ్రామికవేత్తలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

మరో మూడు మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: మరో మూడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు చైర్‌పర్సన్లను, వైస్‌ చైర్‌పర్సన్లను, నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి జిల్లా కాటారం, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌, మంథని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు నూతన కార్యవర్గాలను నియమించింది. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 167 మార్కెట్‌ కమిటీలకు నూతన…

సాగు విస్తీర్ణం అంచనాకు ప్రణాళికలు సిద్ధం చేయండి

వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలకు మంత్రి తుమ్మల సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: రాష్ట్రంలో సాగవుతున్న పంటల విస్తీర్ణాన్ని అంచనా వేయటం ద్వారా రానున్న కాలంలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రొ. జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిపాదించిన ప్రాజెక్టుపై వ్యవసాయ శాఖ…

హెచ్‌ఎండీఏ ప్రణాళికలు భేష్‌

హెచ్‌ఎండీఏ కార్యాలయానికి జేడీఏ బృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ప్రణాళికా చర్యలను అధ్యయనం చేయడానికి జైపూర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (జేడీఏ) నుంచి కమిషనర్‌ ఆనంది నాయకత్వంలోని ప్రతినిధి బృందం హెచ్‌ఎండీఏ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించింది. ప్లానింగ్‌ డైరెక్టర్‌ ప్రీతిగుప్తా, అదనపు చీఫ్‌ టౌన్‌ ప్లానర్‌ అంకుర్‌ దధీచ్‌,…

జువైనైల్‌ హోం ఘటనలో ఇద్దరు సూపర్‌వైజర్లపై వేటు

– ఐదుగురు బాలల పరార్‌పై మంత్రి సీతక్క సీరియస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: సైదాబాద్‌ జువెనైల్‌ హోం నుంచి ఐదుగురు బాలలు మంగళవారం రాత్రి తప్పించుకుపోయిన ఘటన పట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సీరియస్‌ అయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను…

చేనేత సంఘాల సమస్యలను పరిష్కరించాలి

– కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డికి చేనేత సంఘాల వినతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: చేనేత సంఘాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తనను కలిసిన చేనేత సంఘాల నేతలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి హామీ ఇచ్చారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన చేనేత సంఘాల నేతలు శుక్రవారం ఆయనను హైదరాబాద్‌లో…