Category తెలంగాణ

గోదావరి వరద తగ్గుముఖం

పలు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలు ఇంకా అక్కడక్కడా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : వారం రోజులుగా ఉధృతంగా ప్రవహించిన గోదావరి క్రమంగా తగ్గుతూ వొస్తుంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో నెమ్మదించింది. గోదావరితో పాటు ఉప్పొంగి ప్రవహించిన వాగులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం(సరస్వతి) బ్యారేజీలోకి శనివారం…

భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి

మళ్ళీ పెరుగుతున్న  వరద –  5అడుగులు పెరిగే అవకాశం భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 18 : గతవారం రోజులుగా గోదావరి వరద భయభ్రాంతులకు గురి చేసింది. అనేక గ్రామాలను వరదతో ముంచెత్తింది. నేటివరకు ఇంకా వరదముంపులోనే గ్రామాలు ఉన్నాయి. పంటపొలాలు కూడ చెరువులను తలపిస్తున్నాయి. ఆదివారం నుండి భద్రాచలం వద్ద గోదావరి మెల్లగా తగ్గుముఖం పట్టింది.…

పోడు రైతులపై దాడులు ఆపాలి

డిమాండ్‌ ‌చేస్తూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖ పోరాటం ఉధృతం చేయాలని ఆదివాసీలకు పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : పోడు రైతులపై ఫారెస్ట్, ‌పోలీసు అధికారుల దాడులు నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్‌ ‌చేసింది. దీనిపై మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ ‌పేరిట లేఖ విడుదలైంది. రైతులపై…

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అక్కడిక్కడే ఆరుగురు దుర్మరణం కామారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 18 : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం జిల్లాలోని 161వ జాతీయ రహదారి మద్నూరు మండలం మెనూరు వద్ద లారీ-ఆటో ఢీకొట్టుకున్న ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అందిన వివరాల్లోకి వెళితే మద్నూరు నుంచి బిచ్కుంద వైపు జాతీయ రహదారిపై…

పోలవరం వల్ల భద్రాచలానికి ముప్పు ఉంది

 తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ‌వి.ప్రకాష్‌ ‌వ్యాఖ్యలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే భద్రాచలం గ్రామం పూర్తిగా మునిగిపోతుందని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ‌వి ప్రకాశ్‌ అన్నారు. 67 అడుగుల ఎత్తులో వరద ప్రవాహం కొనసాగితేనే రామాలయం వెళ్లేందుకు వీలు లేకుడా అష్టదిగ్భందనం అయిందని, అదే పొలవరం పూర్తయితే…

చురుకుగా వరంగల్‌ ‌నూతన హాస్పిటల్‌ ‌నిర్మాణం పనులు

మరింత వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌కు మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం సహచరులతో కలిసి పరిశీలించిన మంత్రి వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : వరంగల్‌ ‌సెంట్రల్‌ ‌జైలు స్థలంలో నూతనంగా నిర్మిస్తున్న మల్టీసూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌పనులను, నిర్మాణ నమూనాను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు తన మంత్రివర్గ సహచరులతో కలిసి పరిశీలించారు. పనులను…

రూపాలు మార్చారు…పూజలు శాస్రోక్తంగా లేవు

గర్భాలయంలో కూడా పూజలు సక్రమంగా లేవు మీ కళ్లు తెరిపించడానికే భారీ వర్షాలు కరిపిస్తున్నా లష్కర్‌ ‌బోనాల పండుగ రంగంలో స్వర్ణలత ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో సోమవారం రంగం కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఆలయంలో సరిగ్గా పూజలు…

ప్రతి జిల్లాలో మెడికల్‌ ‌కళాశాల: వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

ఇక విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అసంక్రమిత వ్యాధులను స్క్రీన్‌ ‌చేసిన ఏకైక రాష్ట్రం మనదే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : ప్రతి జిల్లాకు మెడికల్‌ ‌కాలేజీ ఉండే ఏకైక రాష్ట్రం మన తెలంగాణ కాబోతున్నదని మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. ఎంబీబీఎస్‌, ‌పీజీ సీట్లను పెద్ద…

రైలులో నేడు ఉదయం మణుగూరుకు చేరుకోనున్న గవర్నర్‌

‌గవర్నర్‌ ‌డాక్టర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌నేడు భదాద్రి-కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. శనివారం న్యూ దిల్లీలో రాష్ట్రపతి రామ్‌ ‌నాథ్‌ ‌కోవింద్‌ ‌వీడ్కోలు విందుకు ఆమె హాజరు కావల్సి ఉన్నా ఆ పర్యటనను రద్దు చేసుకుని ఆమె హదాద్రి వరద ప్రాంతాలో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. భద్రాచలం మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో వరద…