Category తెలంగాణ

మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది 

చిన్నకోడూరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 1:  మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను కలియ తిరిగి పరిశీలించారు. ప్రతి మంగళవారం నిర్వహించే  ఆరోగ్య మహిళ  కార్యక్రమ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ మాట్లాడుతూ….. ఆరోగ్య మహిళ…

లక్ష ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకాన్ని ప్రవేశపెట్టిందని, పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని అర్హులైన క్రిస్టియన్ మైనార్టీలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.…

గ్రామపంచాయతీ కార్మికుల 28వ రోజు సమ్మెలో భాగంగా వంటావార్పు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,ఆగస్ట్ 1; మొయినాబాద్ మండల కేంద్రంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు.మొయినాబాద్ మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయడం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. నిన్న జరిగిన మంత్రివర్గ  క్యాబినెట్లో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె గురించి వారి సమస్యల గురించి ప్రస్తావించకపోవడం దారుణమని గ్రామపంచాయతీ కార్మికులు పారిశుద్ధ్య…

ముద్విన్ లో సీసీ రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన  : ఎంపీపీ కమ్లిమోత్య నాయక్

 ఆమనగల్లు ప్రజాతంత్ర ఆగస్ట్1 : కడ్తాల్  మండలంలోని ముద్విన్ గ్రామంలో ఎంపీపీ నిధుల నుంచి సిసి రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ  పనులకు ఎంపీపీ కమ్లి మోత్య నాయక్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనులను నాణ్యతగా 10 కాలాలపాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో…

*కడ్తాల్ లో  కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 1 : కడ్తాల మండలం వంపుగూడ –  చల్లపల్లి  సాలార్పూర్ గ్రామాల మీదుగా పడకల్ గేట్ వరకు  డబుల్  రోడ్డు నిర్మాణానికి రూ.18 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి గ్రామణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో…

గ్రామ పంచాయతి ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కరించాలి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్టు 1 : రంగారెడ్డి జిల్లా,మంచాల్ మండల్ కేంద్రంలో గ్రామ పంచాయతి ఉద్యోగ,కార్మికులు చేస్తున్న సమ్మె 27 వ రోజుకు చేరింది.రైతు సంఘం నాయకులు,గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం నాయకులు కార్మికుల సమ్మె కు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు రావుల జంగయ్య మాట్లాడుతూ,గ్రామ పంచాయతి  ఉద్యోగ,కార్మికులు గత 27…

జాతీయ పురస్కారాల ఎంపికకు ధరఖాస్తుల ఆహ్వానం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 01 : ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల గ్రామలలో, పట్టణాలలో మట్టిలో మాణిక్యాల్లాగా దాగి వున్న సమాజ సేవకుల, ఉపాధ్యాయుల, వైద్యుల, కళాకారుల, కవుల, రచయితల, క్రీడాకారుల, విద్యావంతుల, కార్మికుల, కర్షకుల సేవలను, ప్రతిభను గుర్తించి వారికి ‘సేవా భారతి’ జాతీయ పురస్కారాన్ని ‘తెలుగు తేజం’…

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి రెండు సంవత్సరాలు పూర్తయినా నేటి వరకు ప్రజలకు ఎందుకు అందజేయలేదు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్టు 1 :  నియోజకవర్గంలోని మంచాల మండలం లింగంపల్లి చౌరస్తాలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంగళవారం ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈసీ.శేఖర్ గౌడ్ (మామ)పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్రంలో ప్రటిపక్షాలను పోలీసులచే కెసిఆర్ అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని,తమ కార్యకర్తలను,నాయకులను  ఎక్కడిక్కడ ఆపడం వల్ల కార్యకర్తలు రాకుండా ఉంటారనేది…

నిరుపేద ఐ.ఐ.టి విద్యార్థికి ఉపసర్పంచ్ మల్లేష్  రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు ఆగస్ట్ 1 : మండలంలోని మేడిగడ్డ గ్రామపంచాయతీ కి చెందిన నేనావత్ సందీప్ 6 నెలల క్రితం ఐ.ఐ.టి అల్ ఇండియా ఎస్టీ కేటగిరీలో ఐ.ఐ.టీ మద్రాస్ లో 139వ. ర్యాంక్ దక్కించుకున్నాడు.. కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితుల దృశ్య తన చదువును కొనసాగించేందుకు ఆర్థిక సహాయం చేయవాల్సిందిగ మేడిగడ్డ తండా…