Category Shoba

నేనూ తానూ

మాటల తడి మనమధ్య ఆరిపోయినప్పుడు తాను పలకరింపుల తుంపరలనైనా చిలకనప్పుడు నేనూ ఆత్మాభిమానం అడ్డొచ్చి పెదాలు బిగించి మౌనాన్ని ఆశ్రయిస్తాను చెప్పేందుకు మేమిద్దరం జత జీవన సహచరులమే అయినప్పటికీ…. తాను తానుగానే ఉండి పోతాడు నేను నాకునేనుగా మిగిలిపోతాను లోకం కోసం లేని నవ్వుల్ని మొహాలపై కృత్రిమంగా అతికించుకుని బ్రతికే విచిత్ర కాపురం మాది అయినా….ఒకే…

జీవన వేదిక..

అరమరికల్లేని అంతరంగపు అనిర్వచనీయ భావ విశాలతను కొత్తపలకగా ప్రఖ్యాత కవి డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి ప్రజ్వలింపజేశారు. ఉరిమే ఆకాశంలో వాస్తవాల సునామీలా వ్యక్తమవుతూనే ఆకురాలిన నిశ్భబ్దంలా నిండారా కవిత్వమై ఆయన ప్రవహిస్తారు. చక్రం తిప్పి కుండల్ని తిప్పినంత ఒడువుగా/ మగ్గం మీద మేలిమి చీరల్ని నేసినంత ప్రేమగా/ మార్పుకు స్వాగత తోరణాల్ని కడుతూ కవిత్వాన్ని అందమైన…

గాయాల పరిమళం…

మూడు దశాబ్దాలుగా ఆత్మ విశ్వాసంతో నిబద్ధత కలిగిన కవిత్వం రాస్తున్న కవి బెల్లంకొండ సంపత్‌ కుమార్‌. స్వేచ్ఛాయుతమైన భావాలతో, సమ సమాజ స్థాపన లక్ష్యంగా మలుచుకున్న తీరుకు అద్దం పట్టే కవితలతో ఒక వేకువ కోసం సంకలనాన్ని ఆయన వెలువరించారు. నిబద్ధత, నిజాయితీ,సరళత,సూటిదనం, సున్నితత్వం కలిగిన ఆయన కవిత్వం ఎన్నో అంశాలను, సంఘటనలు, సందర్భాలు, వైరుధ్యాలు,…

సామాజిక అసమానతలు రూపుమాపడానికి గళమెత్తిన గద్దర్‌

ప్రజా వాగ్గేయ కారుడు, ప్రజా కవి, కళాకారుడు ప్రజా   యుద్ధ నౌక గద్దర్‌  తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయి పద్దెనిమిది నెలలయింది.  గద్దర్‌ అసలు పేరు గుమ్మడి విఠల్‌ రావు,  మెదక్‌ జిల్లా తూఫ్రాన్‌కు చెందిన లచ్చమ్మ, శేషయ్య దంపతులకు జనవరి 31న 1949లో ఆయన…

నాన్న

నాన్న అనే పదం రెండు అక్షరాలు తన భాద్యతలు మాత్రం మోపెడు తండ్రిగా, కొడుకుగా, భర్తగా అల్లుడిగా తన భాద్యతలు నిర్వహిస్తున్నాడు…. మన పుట్టుకతో సంబురపడుతూ గుండెలపై ఆడించిన రోజులు మధురం నాన్న వేళ్ళు పట్టుకుని బుడి బుడి అడుగులతో ప్రయాణము మొదలు పెట్టి నాన్న భుజాలపై మొదటి సారిగా ప్రపంచాన్ని చూసి….. పోటీ ప్రపంచంలో…

మతోన్మాద ఉచ్చు

ఒక గంపలో రెండు కత్తులు. భక్తి – భయం తెగిపడ్డ నెత్తులు, ఈ మతోన్మాద మోదంలో నువ్వు బలిపశువ్వి. నిన్న వేరొకడు – నేడు నువ్వే, నీ ప్రశ్నలంటే భయం వాడికి. జవాబుల్లేని పేడ బుర్రవాడిది, నీ విమర్శంటే ఒళ్లంతా వణుకే. కర్షక శ్రమనెరుగని దోపిడీ దొంగే, తర్కం లేని వాడి మొఖం చూడు! సహజ…

కవితాదాహం

కవిత్వం కవులకు కలిగేదాహం ఎప్పటికీ తీరనిదాఘం కవిత్వం మనసులతొలిచే కీటకం మదులలోపుట్టే ప్రకరణం కవిత్వం ఆలోచనల పర్యావసానం భావజ్వాల బహిర్గతరూపం కవిత్వం అక్షరాల అల్లకం పదాల పేర్చటం కవిత్వం పువ్వుల హారం పరిమళ ప్రసరణం కవిత్వం తియ్యని మకరందం వీనులకు విందుభోజనం కవిత్వం అనుభూతుల అక్షరాకారం అంతరంగాల ప్రతిస్పందనం కవిత్వం అందాల ప్రదర్శనం ఆనందాల కారకం…

‌పొదుపు

కూడికలు తీసివేతలు కాదు జీవితం అంటే భాగహారాలు గుణకారాలు కూడా ఉంటాయి ఏటిలో పుణ్యం కొరకు వేసె డబ్బును లెక్కపెట్టి పెద్దలు వేయ మన్నారు పుట్టుక నుండి చచ్చేదాక లెక్కాపత్రం ఉంటుంది లెక్కల్లో జాతక చక్రం ముడిపడి ఉంటుంది… నీరున్న తొట్టిలో నీరున్నంత వరకు తొట్టి కలకల లాడుతుంది నీరు తోడతుండాలి నింపుతు ఉండాలి అలానే…

‌జీవమున్న జ్ఞాపకం

మౌనమంటించిన మనసుచితిలో ఒక్క నిప్పురవ్వ బతుకులో రాలి గాలి కెరటాలకు పగటి లోతుకు చేరి కరిగిన క్షణాలది అక్షరాలా మరణమే. జీవమున్న జ్ఞాపకమే. నిలువెత్తు నిజాన్ని మింగేసిన ఆకాశంలో మిగిలిన శూన్యంతో పోరాడిన ప్రాణం గెలుచిన కన్నీళ్ళ ఈతకు ఊహకందడం లేదు ఒడ్డు. – చందలూరి నారాయ