త్రివర్ణ పతాక రెపరెపలు నాగరికత అతి పురాతనం బహు భాషల గళహారం అనేక కులాల ఐకమత్యం పలు మతాల పరిమళం భిన్న జాతుల వైవిధ్యం బహుళ జాతి జన జీవనం భిన్నత్వ లక్షణాల భారతం ! పుణ్య నదుల సమాహారం సకల సంస్కృతుల సమ్మిళితం సమిష్టి కుటుంబ సౌభాగ్యం భరతుడి పాలన ఆదర్శం ఆర్యుల వేద…
Category సాహిత్యం-శోభ
పన్నుపోటు బాబోయ్!
ఎంత వెర్రి వాణ్ణి! అంతటా ఒకే పన్ను అనగానే ఎన్నో ఆశలు నా ఎదలో పొదలై మొలిచాయి. చిగురులు వేసే భావాలు లోలోపల గుసగుసలాడాయి. మొగ్గలు తొడిగే కొమ్మల్లో పువ్వులు పూసేలోగా పన్నులు గుంపులు,గుంపులుగా ఈగల్లా వాలుతోంటే తెలిసొచ్చింది అది అందగత్తె కాదు కురూపి అని. ఓ నాయకా! ప్రజాస్వామ్య పంట పొలంలో కాదేదీ పన్నుకనర్హం…
సాహితీరథి… దాశరథి
నవ కవన జలధి జాగృత పద్య నిధి సాహితీ రథ సారథి ప్రజా ఉద్యమ వారధి అతడే విశ్వ జగత్ప్రసిద్ధి దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ దాస్య విముక్తికి కలం పోరు సాగించిన వీరుడు కుహనా వర్గ సమాజంపై ధిక్కార స్వరమెత్తిన ధీరుడు నిజాం నిరంకుశ పాలనపై అక్షరం సంధించిన యోధుడు రజాకారుల గుండెల మీద కవనబాకు…
చారిత్రక మహానుభూతి కాల నాళిక…
చరిత్రలో నమోదైన అనేక యుద్ధాలకు, ప్రతి ఘటనలకు, ఆత్మార్పణలకు, ఎదురొడ్డిన తిరుగుబాట్లకు కేంద్రస్థానమై పరిఢవిల్లిన చారిత్రాత్మక ప్రాంతం వరంగల్లు. 1945 నుండి 2017 వరకు వరంగల్లు నగర చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని,బహుముఖంగా భారతదేశ చారిత్రక ఔన్నత్యాన్ని అవపోశనపట్టి విశ్లేషించిన నవల రామాచంద్రమౌళి కాలనాళిక. అనేక చారిత్రక సంఘటనల లోతుల్ని, ప్రజా ఉద్యమ…
అబార్షన్
విత్తిన విత్తు చినుకులతో కులికింది కులికినవిత్తు తడిసి మురిసింది మురిసిన విత్తు ముచ్చటపడి మొలకెత్తింది మొలకెత్తిన మొక్క కురిసిన వానకు వరద పాలైంది వరద పాలెన మడిని చూసి కడివెడు కన్నీటితో అన్నదాత తల్లడిల్లిపోతుండు దవాఖానాలో ఆమెకు పిండం తీసి గండం గట్టెక్కించారు తల్లి ప్రాణం దక్కినందుకు తల్లి కాలేని ఆ తల్లి పుట్టెడు దుఃఖాన్ని…
క్లౌడ్ బరస్ట్ కన్ఫ్యూజన్
ఆడ్డగోలు హామీలు గుప్పించి దొడ్డరీతుల పథకాలు వల్లించి పిమ్మట నాలుక మడతేయడం నేటి నేతగణకు పరిపాటే కదా! తమ తప్పిదాలు కప్పిపుచ్చ ఇపుడు మేఘ విచ్ఛిత్తి అనే సరికొత్త డ్రామాకు తెరలేపింది అనుమానం అనే అస్త్రంతో నిందల పోరుకు సిద్ధపడింది గోదావరి వరదల మాటున విదేశీ శక్తుల హస్తముందని సాక్షాత్ రాష్ట్రాధీశులవారు శంకించడమే దీనికి సాక్ష్యం…
మీకు గొటబాయ గతే !
బుద్ధిజీవని గద్దెనెక్కిస్తే నెత్తిపై సవారీ చేయవడ్తివి ఉద్ధరిత్తవని పగ్గాలు ఇస్తే పితురిగద్దలా పొడుస్తుంటివి అండగా ఉంటవని తలిస్తే… దండగ చేష్టలకు తెగబడ్తివి బతుకు వెలిగిత్తవంటే చితి మంటలు రాజేస్తివి మెతుకు దేశం చేస్తవంటే ఆకలి రాజ్యంగా మారిస్తివి దేశ సంపద కొల్లగొట్టి కార్పొరేట్లకు కట్టబెడ్తివి జాతి ఆదరువులను పరాయికి అప్పగిస్తివి ఏకంగా సంపన్న దేశాన్ని అంగడి…
పోడు భూముల పోరు
‘వాళ్లు అడవి బిడ్డలు ఈ దేశ మూల వాసులు వనసంపదకు వారసులు అనాదిగా పోడుభూములు ఆసరాగా బతుకుతునోళ్ళు ఇపుడు… దోపిడీ మరిగిన రాజ్యం అటవి భూములపై కన్నేసి తేరగ కాజేయ పూనుకుంది పట్టాల హామీల పాతరేసి ఖాకీ మూకలను ఎగదోసి గిరిజన మహిళలు,తల్లుల్ని బట్టలు ఊడేటట్టు చితక్కొట్టి చీకటి కటకటాల్లోకి నెట్టేసింది పాలకుల పాశవికత్వానికి పూరి…
నవజీవన వేదం..!
కంటిలో రెటీనా పొరను కరెన్సీ తెరలు కమ్మినాక నీ ప్రతి వీక్షణంలో.. కపటపు క్రీనీడలు తప్పా ! కరుణ కాంతికి జాడెక్కడిది ? మస్తిష్కవేళ్ళ మొదళ్లలో మౌఢ్యకుళ్లు అల్లుకున్నాక నీ ప్రతీ ఆలోచనలో… అంతరాల దొంతరలే తప్పా! సమైక్య జీవనకు చోటెక్కడిది? నవనాడులు మూలాల్లో స్వార్థ వ్యర్థాలు పోగయ్యాక నీ ప్రతీ అడుగులో.. విద్రోహ ముద్రికలే…
