Category సాహిత్యం-శోభ

అం‌తరంగ దృశ్యీకరణ…

మనషివవ్వాలంటే/ అప్పుడప్పుడు / కన్నీళ్లతోటి/ మాట్లాడు అంటారొక నానీలో ప్రముఖ కవి, విమర్శకులు డాక్టర్‌ ఎస్‌ ‌రఘు. నానీలలో అసాధారణ మానవీయ కోణాల్ని దృశ్యీకరించిన ఆయన జీవనలిపి లోకి తొంగి చూస్తే అనంతకోటి ఆర్తి చిత్రాన్ని అజరామరంగా పలికేది ఖచ్చితంగా కవిత్వమేననిపిస్తుంది. హృదయగత భావాలను వెల్లడించగలిగే ప్రక్రియగా నానీలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత,…

పుస్తకమెపుడు సజీవమే

పుస్తకం అంటే మూడు అక్షరాలు కాదు! త్రికాలాల గతిని మతికి తెలిపేది పుస్తకం మనిషి మస్తకమే! మది మదించిన విజ్ఞాన సాగరం! పుస్తక పేజీలు చదవ జీవిత రోజులు చాలవు! పుస్తకాలు గురువు లాంటివే! చదువరిని ఆలోచింపజేసీ ఆచరింప జేస్తవి! పుస్తకానికి మతిమరుపు ఉండదు చదువరి మతిమరుపు పోగొడ్తవి పుస్తకాలు ఒంటరి స్నేహితులు మరో లోకం…

చైనా కూలుతోంది

కొరోనా మలి విజృంభణతో అగ్రజున్నని విర్రవీగిన చైనా పసికూనలా వణుకుతుంది తలొగ్గేదే లేదన్న డ్రాగన్‌ ‌తలొంచి మోకరిల్లుతుంది పటిష్టమేనన్న బీజింగ్‌ ‌పునాదితో కూలుతుంది తను పుట్టించిన కొరోనా తననే మట్టి కరిపిస్తుంది తను రాజేసిన మంటల్లో తానే తగలబడిపోతుంది ఇపుడు దేశం అంతటా ప్రాణాలు రాలుతున్నయ్‌ ‌పీనుగలు పోగవుతున్నయ్‌ ‌చితి సెగలు రగులుతున్నయ్‌ అ‌శ్రు నదులు…

బుక్‌ ‌ఫెయిర్‌

హైదరాబాద్‌ ‌లో నడి బొడ్డున పుస్తకాల పండుగ బడి పిల్లలతో మొదలు రిటైర్డ్ ఉద్యోగుల వరకు సెలబ్రిటీల నుండి సామాన్యుల దాకా పుస్తకాల తాకిడి జోరుగా సాగుతూ పుస్తక ప్రియులకు పండుగ వాతావరణం వచ్చింది బాల సాహిత్యం నేటి తరానికి అవసరం నేడు శాస్త్ర సాంకేతికత పరుగులు తీస్తున్న తరుణంలో పిల్లలకు పుస్తక పఠనం తప్పనిసరి…

ఏమిటిదీ

అందమైన ప్రకృతిలో విహరిస్తున్న.. నా మనసెందుకో మందంగా ఉంది, ఏదోలా అనిపిస్తుంది. చుట్టూ ఏదో ఆవహించి చురుకుదనం ఆవిరైంది.. ఇది గ్రహచారమా లేక నా అపచారమా? గాలి వీస్తుంది చిరు వెన్నెల కురుస్తుంది, చుక్కలుమెరిసే ఆకాశంలో చందమామ విహరిస్తోంది. అదే దేశం-ఇదే ప్రదేశం, అయినా.. ఏదో దిగులుగా ఉంది, ఆహ్లాదం.. దారికి రానంటుంది, ఇది ఏదైనా…

చెరిగిన ముద్రలు

కాలగర్భంలో కలిసిపోయిన మనుషుల జ్ఞాపకాల నుంచి లేచిన స్పందన! మనిషికి మరణించడం కూడా ఒక ఆయుధమే ఎందుకంటే ఆ ఆయుధం ఉన్న వాళ్ల మనసులను గుణపం వలే తొలుస్తుంది! వెళ్లిపోయిన వాళ్లకి ఏలా తెలుస్తుంది ఉన్న వాళ్ళ బాధ ..? బరువైన గుండె వ్యధ…? ప్రతిరోజూ  వారితో గడిపిన జ్ఞాపకాల్ని .. ప్రతినిత్యం వారి ఆలోచనల్నీ…

కాలానికి రోషమెక్కువే…

జరిగేది తెలియనప్పుడు కోల్పోవడమేమిటి? పొందటమేమిటి? జమా ఖర్చులతో పొగిడినా,నిందించినా కాలానికి రోషమెక్కువే తెలియకుండా ఓ అర్హతనిచ్చి గౌరవంగా మనసుకు గుర్తింపునిచ్చి ముఖంపై వేగనిరోధంలేని మాటల ప్రయాణంలో తిలకించిన దృశాలలో కాలం అడుగులను లిఖించిన వాస్తవాలను మది మడుగులో మగ్గపెట్టి తలపుకొచ్చే క్షణకాలంలో చిగురించిన సువాసనాలతో దేహాల్లో ఊహలు తలుపు తెరచుకుని చిరిగిన కలకు చికిత్సతొ అరిగిన…

గుండె గొంతులో…

అక్షరానికే అంతుపట్టడం లేదు మూగబోయిన నా మనోవేదనని వర్ణించేందుకు. నిత్య బోయీనైన నాలో ఎద మోయలేని భావాలభారాలు వెల్లువెత్తుతోంటే, నాలోని ఆవేదన సుడిగాలై నను నిలవనీయట్లేదు, నేనొక మూగ జీవిని. ఏదో సాధించాలన్న తపన నాలో ఉన్నా, ఏమీ చేయలేని మౌనజీవిని. నిజాలు తేటతెల్లంగా కనిపిస్తున్నా దృష్టిలోపమున్నట్టు అబద్దాలకే మద్దత్తు లభిస్తోంటే, నిఖార్సయిన నిజమిదంటూ ఎలుగెత్తి…

లెక్కల్లో మనీషి

జీవితమే పెద్ద ప్రశ్న, ఒక పెద్ద గ్రంధం. దండలో దారం మాదిరి తనువులో ప్రాణం పగిది, మనిషి దైనందిన జీవితంతో పెనవేసుకొన్న శాస్త్రాలకే శాస్త్రమైన గణితాన బాలమేధావిగా గణుతికెక్కి, తన మస్తిష్క గోడలన్నీ గణిత భావజాలపు రూపాలను పూయిస్తోంటే, గణితపూలను కోసి జగతి సిగలో పెట్టాలనే తపనల దారులలో ఊహల్ని తలుపులేసుకొని పడుకోనీక, దారిద్య్రపు నిర్బంధాన్ని…