Category సాహిత్యం-శోభ

హృద‌య భాష క‌విత్వం…

దండిగా మాన‌వ‌త్వ‌పు మూలాలున్న క‌విత్వం అనేక సంచారాల్లో కూడా విల‌క్షణ  అన్వేష‌ణల వీక్షణ‌మ‌వుతుంది. ఆరంభ‌మైన న‌డ‌క‌ని గ‌మ్యానికి  చేర్చే దిక్సూచి లాంటిది క‌విత్వ‌పు బాధ్య‌త‌. క‌వి క‌విత్వం  రాయ‌టానికి స‌మాయాత్తం కావ‌ట‌మంటే  అగ్ని పూసిన అక్ష‌రాల‌ను,  కాగి మాగిన అనుభ‌వాల‌ను దోసిట్లో ప‌ట్టుకోవ‌డ‌మే. శిథిలాల‌ను,  భ‌యోద్విగ్నాల‌ను కూడా  ప‌దిలంగా క‌విత్వంలోకి ఒంపే ధీర‌త‌ను క‌వి పుణికి…

పైశాచికం

కొన్ని పరిస్థితులకు తలవొగ్గితే నీ పరువేం పోదు నీ నిసహాయత చూసి హేళన చేయనీయి నవ్విన నాప చేను పండించి చూపించు చదువుకుంటేనే సంస్కారం వస్తుంది అనుకునే వెర్రి భ్రమల్లోబతకొద్దమ్మ తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దే కుసంస్కారులు తిరిగే పాడు లోకం ఇది నగ్నంగా నిన్ను ఊరేగించి వికృత చేష్టలు చేసిన సైకోల…

నగ్నంగా నడిచింది దేహం కాదు…..అది దేశం..

యుగాలు దాటొచ్చిన మనిషిని మృగాలుగా మార్చింది ఎవ్వడు ? పాలిచ్చిన అమ్మల రొమ్ములను బరి తెగించి ఊరేగించిన ఉన్మాదానికి ఊతమిచ్చింది ఎవ్వడు ? వేట కుక్కల్ని ఉసి గొల్పింది ఎవ్వడు ? విద్వేషాన్ని రక్త నాళాలలోకి ఎక్కించింది ఎవ్వడు? తల్లుల జననాంగాల మీద తాండవమాడిన గాడిద కొడుకులను కని పెంచింది ఎవ్వడు ? నెత్తురుని మరిగించింది…

ఇల్లు- గూడు!

ఇరుకుదో చిన్నదో ఉండేందుకు ఓ నీడ ఉన్నందుకు అందరం కలిసి ఓ చోట మనసు దుప్పట్లను పరిచి తనివితీరా ఊసులాడేందుకు ప్రేమగా అల్లుకున్న అందమైన మా ‘తులసీనందనం‘* గూడున్న అభాగ్యనగరపు అమీరులం ! బ్రతుకు పయనంలో అలుపెరగని బాటసారులం ! మాపాలిటి మయుడైన సుతారి మేస్త్రి నర్సింహులు మా అవసరాల మేరకు ఆకాంక్షల రూపానికి సుతారంగా…

ఏమో మరి…

ఆకాశం నెర్రెలు బారి నీటి చుక్కల కన్నీటి జాడలో ఇంకిన నిజంతో పాయలుగా చీలి కల గాయపడ్డ రాత్రుల్లో కలవరింత గోతుల్లో ఎర్రపడ్డ ఊహలని తవ్వుకున్నప్పుడు తలిగిన జ్ఞాపకాల వెలుగుతో దేహాపు చీకటిలో పారె  ఇష్టం పొర్లి తేలిన అనుభవాల ఆసరాతో కలే చమురుగా  కదిలే  బతుకు ఏ తీపి తీరం చేరునో! ఏ చేదు…

సంపుటం!

రెండు మనసుల మధ్య మమతల సమరం! రెండు వయసుల మధ్య సరసాల కథనం! ఆధిపత్యపు పోరులో తడి పొడి చప్పరింపులు! అనురాగాల బదలాయింపులో ఇచ్చిపుచ్చుకునే వాయినాలు! వేళాపాళల హద్దులు లేని పయనం వయసు సీమలు లేని ప్రణయం! వలపుల పందేరంలో తొలి, తుది పణాలు అక్కడే! ముచ్చట్లు, ఇక్కట్లు అక్కడే! రసిక యుద్ధంలో సప్తమరుచి అనుపానమక్కడే!…

చేరువయ్యె దూరాలు!

మా ఇంటి నుండి శుభోదయ శుభాకాంక్షలు గాలి కెరటాల్లో తేలియాడుతూ పలకరిస్తాయి పులకరింప చేస్తాయి మెత్తగా సుతిమెత్తగా… మీ ఇంటి నుండి ఉదయ సన్నాయిరాగాలు లయబద్ధంగా అనురాగాలు ఒలక బోస్తూ వసంతకాల ఆనందాలను అందిస్తాయి… దూరాలు పెరిగి తే బంధాలు దూరమౌతాయి అది పాతమాట నేడు దూరాలు పెరిగిన బంధాలు బలంగానే ఉన్నాయి… మంచి చెడులు…

అమ్మ నెరగను…!!

చందమామని మభ్య పెట్టి బూచోడిని భయపెట్టి! అమ్మ తినిపించిన వెన్నెలముద్దల్ని ఎరగను !! అమ్మపాడే లాలి జోల పాట రాగాల చెమ్మ స్సర్శినీ ఎరిగను తప్పుల తడకల తోవల!వెంటనే తన్మయుణ్ణే సాగుతున్నప్పుడు! నా నిషా మనసుపై చెంపదెబ్బల ! చిలకరింపయ్యేదన– అమ్మ క్షతగాత్ర మనశ్శరిరుణై నే నిద్రపోతున్నప్పుడు నిలువెల్లా దిగులు దీపమై నా చుట్టూ వెలిగేదీని—-…

హృద‌య భారాన్ని త‌గ్గించే ప్ర‌య‌త్నం

 క‌విత్వం మనకు మ‌నం వెతుక్కునే జ్ఞాన‌దిశ/క‌విత్వం మ‌న‌కు మ‌నం చేసుకునే విచికిత్స అని ప్ర‌ఖ్యాత క‌వి డాక్ట‌ర్ బెల్లి యాద‌య్య చెప్పిన‌ట్టుగా ఎన్నో జీవ‌న సంఘ‌ట‌న‌ల నుండి సంద‌ర్భోచిత కోణాలు నిరంత‌ర, నిత్య‌నూత‌న క‌వి దండ‌మూడి శ్రీ‌చ‌ర‌ణ్ క‌విత్వంలో కోకొల్ల‌లుగా క‌న్పిస్తాయి. మ‌ధూళి  పేరిట ఆయ‌న క‌వితా సంపుటి వెలువ‌డింది. నిశీధిలో నిశ్శ‌బ్దం విషాదాన్ని ప‌లికిస్తుంటే…