Category సాహిత్యం-శోభ

లోభం ప్రలోభం – ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యంలో ప్రలోభాల రాజ్యం వాగ్దానాలతో  ఆర్థిక విధ్వంసం ఎన్నికల వేళ  ఎడాపెడా హామీలు హద్దుమీరిన తాయిలాల వర్షం వాగ్దానాలన్నీ  నీటిమీద  రాతలుగా అమలుకు నిధులెక్కడివని అప్పుచేసి  పప్పుకూడు రీతిగా ప్రజలపై పన్నుల భారం తో దివాలాకోరు  ప్రభుత్వ విధానాలు అప్పులతో  ఎన్నికల  తాయిలాలు భూటకపు  వాగ్దానాలు . కరెన్సీ నోట్లు వెదజల్లే ఆచారం అధికారం కోసం…

గురుదేవో… నమోస్తుతే

గురువర్యా ! అమ్మ ఒడిలాంటి మీ బడి సన్నిధిలోనే కదా బతుకు పాఠం నేర్చుకుంది మీ విజ్ఞాన జ్యోతులే కదా భవిత దారి చూపుతుంది మమ్ము ఉన్నతులు చేయ మహర్షిగా అవతరించారు విజ్ఞానులుగా తీర్చిదిద్ద మేధో మధనం చేశారు విజ్ఞాన సుధా రసాలు మదిలో నిక్షిప్తం చేశారు శిలలం మేమైతే.. శిల్పులు మీరయ్యారు క్రియలు మేమైతే..…

ముసుగులు

ముసుగులు చిత్ర విచిత్రాలు కనిపెట్టకపోతే కావచ్చు కన్నీటి పర్యంతం కొన్ని మనసులు దోచుకుంటే సంపదను, సర్వస్వాన్ని దోచుకునేవి మరికొన్ని మేలు చేసేవి, కీడు చేసేవి ఉంటాయి పక్క పక్కనే విభజన చేసి చూడకపోతే నష్టమే జోకర్‌ ‌ముసుగులు సర్కస్‌ అసెట్‌ ‌నవ్వినా, ఏడ్చినా ఉయ్యాలలూపుతాయి నవ్వుల్లో బుడ్డరఖాన్‌ ‌వేషాలు రక్తి కట్టిస్తాయి నాటకాన్ని తన్నులు తిన్నా,…

పరస్పర సహకారానికి చిహ్నం – రక్షాబంధన్‌

మన  దేశంలో  నిర్వహించుకునే ప్రతి పండుగకు ఒక బలమైన కారణం ఉంటుంది.అది మన భారతీయ సంప్రదాయాల వెనుక దాగిన రహస్యం. మన ప్రాచీనులు  ఒక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటే..  ఆ మాసానికి ఆ నక్షత్ర పేరును పెట్టడం జరిగింది. ఆ విధంగానే శ్రవణా నక్షత్రం పౌర్ణమి నాడున్నందున ఈ మాసం…

సేవా తత్పరిణి మదర్‌ ‌థెరిసా

అల్బేనియాలో పుట్టింది రోమన్‌ ‌క్యాథలిక్‌ ‌సన్యాసిని అయింది భారత పౌరసత్వం స్వీకరించింది మిషనరీస్‌ ఆఫ్‌ ‌చారిటీని స్థాపించింది నూట ఇరవై మూడు దేశాలకు విస్తరింపజేసింది పేదలను అక్కున చేర్చుకుంది రోగస్తులను ఆదరించింది అనాధలకు అండగా నిలిచింది శరణాలయాలను నెలకొల్పింది అనేక పాఠశాలలను స్థాపించింది మరణ శయ్య పై ఉన్నవారికి పరిచర్యలు చేసింది మానవతావాదిగా అంతర్జాతీయ కీర్తి…

గుండెను ఈదిన గొంతు

మరిగిన మనసుతో అరిగిన బతుకులో నాలుక పారిన చోటల్లా మొలిచిన ప్రతి గుర్తు గద్దర్… మోసిన అనుభవాన్ని అక్షరంలో రంగరించి మెదడుకు రుచి చూపి చూపి పెలే పల్లవి మోతరా గద్దర్ నిప్పుల్ని నమిలి మింగి ముళ్లను వాటేసుకుని మట్టితో కలసి మెలసి మనిషిని గుండెలో ఈదిన ఈతరా గద్దర్ గుడిసె దిగులు గుబులు తెలిసి చెమట ఇంకిన బతుకు నడచి నలిగిన శరీరంలో పగిలిన ప్రతి కలను చూసి గొంతును ఆయుధంగా మ్రోగిన గళం గద్దర్ ఎత్తిన గొంతులో  వెలిగేత్తే  ప్రశ్నలు కత్తిలా దూసుకుపోయే పదునైన ఆలోచనలు మెరుపులా తాకే చురుకైన శక్తులు పాటలో శక్తికి పట్టం కట్టిన  వీరుడు గద్దరు…. …. చందలూరి నారాయణరావు.               9704437247

అమరగానం

తూర్పు పవన గాలుల జడికి ఎరుపెక్కిన తిరుగుబాటు గళానివి! మట్టి మనుషుల శ్రమ సుగంధాన్ని పాటగా ఎలుగెత్తి ప్రజల గుండెల్లో పదిలంగా నాటిన ప్రజాగాయకుడువి! ఉస్మానియా అలజడుల నడుమ ఎరుపు పాటవై నక్సల్బరి వసంత కాల మేఘ ఘర్జనలో పాటలని  పదును ఈటెలుగా దోపిడీ శక్తుల గుండెలకు గురిపెట్టిన విలుకాడివి నీవు! జనం గుండె చప్పుళ్లకు నీ పాటలే దరువై శివమెత్తి నర్తించే నీ ఆటలు కన్నీళ్ళ వాడల్ని కదిలించి కత్తుల కవాతు దండుగ మార్చేశాయి! అమరుల అమ్మల కన్నీళ్లను ఆర్తితో తుడుస్తూ ఓదార్పు వందనాలు అందించిన కొడుకువి! గంగ దాటెళ్ళి పోయే విప్లవ చెల్లెళ్ళ పాదం మీది పుట్టుమచ్చవై తోడబుట్టకున్నా అన్నవై రుణంతీర్చుకుంటానని బాసచేసినోడివి! అడవులు పల్లెలు మైదానాలు నీ పాటను పలవరిస్తూ కొత్త లోకంకోసం కలల్ని కంటూ తూరుపు దారిలో రేపటి ప్రభాత వెలుగు క్రాంతులయ్యాయి! దుక్కి దున్నే దుర్గన్న మోటకొట్టే మల్లన్న రిక్షా తొక్కే రహీమన్న కలుపు తీసే లచ్చుమమ్మ గనిలో శ్రామికుడు కార్ఖానాలో కార్మికుడు జంగల్ లో అడవి బిడ్డలు లోకపు పీడితుల గొంతువై పాటగా నినదించిన విప్లవ శంఖానాదం నీవు! గోచీబతుకుల కాపరిలా గొంగడి భుజాన వేసుకుని…

యుద్ధం ముగిసిపోలేదు

యుద్ధం ముగిసిపోలేదు యుద్ధం అలసిపోలేదు గుండెలో పద్మవ్యూహమై తూటాకు పాట నేర్పుతూ యుద్ధనౌక సాగిపోతుంది యుద్ధం పాటై ప్రవహిస్తుంది యుద్ధం మాటై పలుకుతుంది యుద్ధం ఆటపాటలై విరామం లేని పోరాటం చేస్తుంది యుద్ధం కోకిల గానం చేస్తూ కొండ కోనల్లో వాగు వంకల్లో నదీ నదాలపై అలలై ప్రవహిస్తుంది యుద్ధం నెమలితోనాట్యం చేస్తూ అడవి బిడ్డలను ఒడిలో చేర్చుకుంటుంది యుద్ధం హావ భావాలతో అరుణ పతాకమై గగనాన రెపరెపలాడుతూ దోపిడీని పాతాళానికి తొక్కుతుంది యుద్ధభూమిలో యుద్ధం నియంతృత్వంపై ఉరుములా గర్జిస్తూ మెరుపులా యుద్ధనౌక సాగిపోతుంది యుద్ధం అలసిపోలేదు యుద్ధం ముగిసిపోలేదు యుద్ధం రాకాసి రాజ్యంపై రాజీలేని పోరాటం చేస్తుంది యుద్ధంలోని రక్తపుటేరులను భుజాలపైనుండి గొంగలి మోసుకుపోతుంది యుద్ధం గద్దరై గర్జిస్తుంది యుద్ధం గద్దరై గాండ్రిస్తుంది యుద్ధం గద్దరై కదనరంగాన కదం తొక్కుతుంది యుద్ధం అలసిపోలేదు యుద్ధం ముగిసిపోలేదు యుద్ధం గద్దరై గానం చేస్తుంది యుద్ధం గద్దరై గజ్జ కట్టింది యుద్ధం గద్దరై నాట్యం చేస్తుంది యుద్ధభూమిలో యుద్ధం విరామ మెరుగని విప్లవ వీరుడు గద్దర్ కు లాల్ సలాం చేస్తూ…

నాకు తెలిసిన గద్దర్‌

గద్దర్‌, ‌నేను సమకాలికులం. విరసం సభ్యుడిగా, రాడికల్‌ ‌యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, గద్దర్‌ ‌జననాట్యమండలి కళాకారుడుగా ఒకే విప్లవోద్యమంలో, భిన్న రంగాల్లో దశాబ్దాలుగా కలిసి పనిచేస్తున్నాము. మా మాతృ సంస్థ పీపుల్స్ ‌వార్‌ ‌పార్టీ, నేటి మావోయిస్టు పార్టీ 1980ల నుండి మేము అనేక రంగాల్లో, అనేక వేదికల మీద కలిసి పనిచేస్తున్నాము.…