Category సాహిత్యం-శోభ

అజ్ఞాత గోలకొండ కవి కుముద

 గోలకొండ కేంద్రంగా కుతుబుషాహీలు ఇప్పటి తెలంగాణ, ఆంధ్రా, కర్నాటక, ఒరిస్సా, తమిళనాడు తదితర ప్రదేశాలను పాలించారు. వీరి పాలన 1518లో ప్రారంభమై 1687లో ఔరంగజేబు దాడితో ముగిసింది. కుతుబుషాహీల పాలనలోనే ఇక్కడి గనుల నుంచి కోహినూరు వజ్రాన్ని వెలికి తీశారు. అలాగే సాహిత్య, కళా రంగాకు కుతుబ్‌షాహీ రాజులు చేసిన సేవ ప్రసిద్ధమయింది. హైదరాబాద్‌ ‌నగర…

దుఃఖం

హృదయ పేటికలోని దుఃఖం ఏ ఊట బుగ్గ నుండి స్రవిస్తోంది? ఏ రహస్య క్షేత్రంలోంచి జనిస్తోంది? ఆశ నిరాశలకి అతీతమై కారణరహితమై ఈ దుఃఖం చోటులో అంతటా పరివ్యాప్తమై ఉందా? ఆనందానికి అవిభాజ్యమై దుఃఖం ఎందుకలా జ్యాలలా రగులుతోంది నిత్యాగ్నిహోత్రమై వెలుగుతోంది దావానలమై గమిస్తోంది క్రూరమైన దయతో ఆశల్ని కాల్చి ప్రేమల్ని తుంచి రుధిర ధారలై…

తెలంగాణ ప్రభుత్వానికి సమకాలీన సాంస్కృతిక విధానం ప్రతిపాదన!

అనేక ఇతర నాగరికతల మాదిరిగానే, తెలం గాణ కూడా భౌగోళికంగానూ, ఇతర వైవిధ్య మైన లక్షణాలతోనూ సమృద్ధిగా ఉంది. అద్భుతమైన సంప్రదాయం తెలంగాణ వెంట ఉంది. సంగీతం, సాహిత్యం, శిల్పం, నృత్యం, నాటకం, అలాగే కవిత్వ కళలు అన్నీ విశే షంగా అభివృద్ధి చెందాయి. ఇవి తరతరాలుగా అందించబడుతున్న జానపద కళా సంప్ర దాయాలలో భాగం.…

శూన్యంలోని అనంతం…

నాలుగు మాటలు పురుడు పోసుకునేది / గాఢ నిశ్శబ్దంలోనే / అస్తిత్వ రహిత సంలీనంలోనే అని ఒక కవితలో ప్రఖ్యాత కవి ఆచార్య కెయెస్ రమణ అన్నారు. నిగూఢ ఆలోచనల జడిలో నిరంతరం ఉక్కిరిబిక్కిరయ్యే కవికి సజీవ నిర్జీవాలన్నిటితో విడదీయరాని అనుబంధం ఉంది. కవి మనసు శూన్యం అయితే అనంత విశ్వం అతని అంతరంగంలో ఒదిగిపోతుంది.…

మానవీయ అంతర్లయ…

వివిధ రకాల ప్రాధామ్యాల లతో కవుల పరంగా నేటి కవిత్వ సృష్టి జరుగుతున్నది. ఒకరికి వస్తువు, మరొకరికి శిల్పం ముఖ్యం. ఇంకొందరు రెండింటికీ ప్రాధాన్యతనిస్తూ కవిత్వం రాస్తున్నారు.సంక్షిప్తత, గుప్తత, నవ్యత కవుల కవిత్వానికి విశిష్టతను తీసుకొస్తాయన్నది సాహిత్య విమర్శకుల సూచన. వస్తువులో, అభివ్యక్తిలో వైవిధ్యాన్ని సంతరింపజేసుకుని కవిత్వాన్ని సృజిస్తున్న కవయిత్రి డాక్టర్‌ ‌కొండపల్లి నీహారిణి. సమాజానికి…

‘‌హెచ్‌సీయూ’ వర్ధిల్లాలి

తుపాకి మీద కూర్చున్న ‘ కాసు’ల కింద మంట పెట్టిన నాటి ప్రత్యేకోద్యమ తెలంగాణ నెత్తుటి సూర్యుల తొలి అమరపు విజయమిది యవనాక్షర త్యాగాలకు స్వేచ్ఛావరణ నివాళిది సజల జ్వాజ్వల్య ప్రాణ వసంతాల జాతరిది ఆ మట్టి కణకణం అమరుల తెలం’గానం’ ఆవరణంతా అక్షరాలు మొలిచి అమరుల ఆశయానికి ఊపిన పచ్చటి భూమి జెండాలైనాయి లేళ్ళు…

‘‘‌కంచ’’ను మేస్తే…

కంచెలను తొలగిస్తమంటే మిమ్ముల కాడెడ్లమై మా మెడలమీదకు ఎక్కించుకున్నం మీరే ‘‘కంచ’’ను మేస్తరని తెలుసుకోలేకపోయినం మీరు రంగమెక్కేముందటి మీ రూపాన్ని గతకాలపు భయం కళ్ళతో జూశిన మేము నీదుత్త వేషమేనని మరిశిపోయినం మీరు రంగమెక్కి ఆడుతుంటే ఒక్కొక్కటిగా యెలిసిపోతున్న రంగుల్లోకెళ్ళి మీ అసలు రూపం బుసలు కొడుతుంది అధికారం రూపకమంతా ఎప్పటికైనా ఒకటేనని బోధపడుతుంది అయ్యా……

ఓ ‌మగువ నీకు వందనం

మహిళా అంటే ఒక శక్తి సృష్టికి మూలం మహిళ మహిళతోనే మనుగడ మరువలేము నీ త్యాగం!! ఆమె సహనానికి మారుపేరు అక్క చెల్లి అమ్మగా తనదైన పాత్ర మహిళా నీకు శతకోటి వందనాలు ఆత్మగాళ్ళు మనసుకలిగిన మహిళ!! ఆమె ఒక అమ్మ ఒక నాన్న ఆమె పొద్దుతో పోటీ పడుతుంది కాలంతో పోటీ పడుతుంది ఆమె…

ఆదివారం అంగడి

ఆదివారం కొన్ని దుకాణాలు రోడ్డు మీదికి వచ్చి పదే పదే పిలుస్తుంటాయి కూడబెట్టడానికి కాదు బతకడానికి పొట్ట చేత బట్టుకొని నెత్తిన ముళ్లే దించుకున్న వ్యాపారాలు పుట్టిన రాష్ట్రంలో పెరిగిన ప్రాంతంలో రెక్కలిరుగ కష్టం చేద్దామంటే పని దొరకని అనిశ్చిత సంక్షోభం క్వారీలు ఇటుక బట్టీలు కోళ్ల ఫారం వ్యవసాయ భవన నిర్మాణ అసంఘటిత కార్మిక…