యుద్ధ బుద్ధులు

నక్షత్రాలను పూలదండలా గుచ్చి లోకం గవాక్షానికి వేలాడదీయాలని అనుకుంటానా పూలతోటనెవరో గుర్రాలతో తొక్కిస్తరు తెల్ల మబ్బులకు నీటిధారల తీగలు చుట్టి వాన రాగాన్ని ఆలపించాలనుకుంటానా శృతుల గతుల నెవరో తుఫాన్ లో కలిపేస్తరు అలల పిల్లలకు ఆటలు నేర్పిస్తుంటానా సుడిగుండాలతో చుట్టుముట్టి అల్లకల్లోల పరుస్తరు కూడలి ఐకమత్యాన్ని నాలుగు దారులుగా చీల్చి, పలుచన చేస్తరు గూటిని…








