Category సాహిత్యం-శోభ

ఆట కదరా

నేతల ఆట వోటు కదరా నేతల ఆశ సీటు కదరా గెలుపు కొరకు సామాన్యుడు దేవుడై పోతాడు కదరా వీధిని బట్టి టోపీ గుడిని బట్టి ఆహార్యం రకరకాల అవతారాలు మోస వ్యవహారాలే కదరా విచిత్ర చిత్రాలు సత్యాసత్యాలు స్వపుత్రిక పత్రికలో ఎన్నెన్ని చిత్ర కథనాలు కదరా కప్పలు సర్పాల ద్విపాత్రాభినయనాలు నక్కల తోడేళ్ళ అంతర్రూపాలు…

తేనీటి తేటకవిత

తేనీరు వేడిగ త్రాగుతుంటే ఊహలు ఉల్లాన ఉరుకులెత్తుతాయి తేనీరు పొగలు క్రక్కుతుంటే కలము కైతలు కారుస్తుంది తేనీరు గటగటా సేవిస్తుంటే పేపరు చకచకా నింపమంటుంది తేనీరు రుచిని చూపుతుంటే గళము గొంతెత్తి రాగంతీస్తుంది తేనీరు మదిని ఉబికిస్తుంటే తేటతెలుగు హృదిని తట్టిలేపుతుంది తేనీరు సువాసన వెదజల్లుతుంటే కవిత్వము సౌరభాలను చిమ్ముతుంది తేనీరు చెంతకు పిలుస్తుంటే నిద్రమత్తు…

కాలతత్వం…

కాలం మహాశక్తి. మనిషిని జోకొట్టి, జేకొట్టి, నిశ్శబ్దంలోకి నెట్టేదీ కాలమే. కాల తత్వాన్ని తెలుసుకునేందుకు ఎంతో కాలంగా మనిషి ప్రయత్నిస్తూనే ముందుకు సాగుతున్నాడు. కాలంలో పుట్టి, జీవించి, అందులోనే కలిసిపోయే మనిషికి ఆ అవినాభావ సంబంధం విడదీయరానిది. మనిషికి కలిగే భావన, సుఖం, దుఃఖం, మంచీ చెడూ, మహోన్నత జ్ఞాన పరిజ్ఞానాలు కాల సంబంధంతో పుట్టినవే,…

రాడికల్‌ ‌పోరలు

ఈ నేల రాడికల్స్ ‌కాలాన్ని తొవ్వుకొంటోంది రక్త మాంస భరితమైన కాలం పురిటి బిడ్డను పున:ర్మూల్యాంకనం చేసుకుంటోంది దుఃఖదారుల్ని మూసి వేసి చీకటి కోణాల్లో దీపం వెలిగించిన సూర్యుల్లను గీసుకుంటోంది విరిగిన రెక్కలకు చికిత్స చేసి నెత్తుటి గాయాల్ని తుడిచి కడగొట్టు గుడిసెల్లో జీవం పోసుకున్న కొత్త మాటల్తో కొత్త పాటల్తో ఊళ్ళు పల్లెలు నిప్పుల…

రెక్కలు తెగిన పక్షి

తెలిసుండాలి ఎక్కడ మృదుత్వంతో మసలుకోవాలో ఎక్కడ కాఠిన్యాన్ని ప్రదర్శించాలో ఎక్కడ సంయమనం పాటించాలో నడవడికే భవితను నిర్ణయించే పరీక్ష కాలమే తీర్పునిచ్చే న్యాయమూర్తి ప్రవర్తన సరిగా లేదని సూచనొస్తుంది ఏదోనాడు అంతరాత్మ నుండో ఇతరుల నుండో పరివర్తన చెందాలి మనసు కీటకాలు రూపవిక్రియనొంది అందంగా మారినట్టు ఆకాశం నల్లటి మేఘాల్ని దులిపేసుకొని తెల్లగా మెరిసినట్టు కాదని,…

కాలం

కాలమెప్పుడూ పాతబడిపోదూ! అదెప్పుడు నిత్య నూతనమే మంచికాలం, చెడ్డకాలమంటూ మనిషే దాన్ని ముక్కలు చేస్తాడు గానీ కాలానికి గాలం వేయగలదా?! కాలమెప్పుడూ పాతబడిపోదూ! ఎండ, వాన, చలికాలమంటూ మనిషే దాన్ని లెక్కలు వేస్తాడు గానీ కాలాన్నీ మార్చగలడా?! కాలమెప్పుడూ పాతబడిపోదూ! నిన్న, నేడు, రేపునంటూ మనిషే దానిలో తేడా చూస్తాడు గానీ, కాలాన్నీ ఆపగలడా?! కాలమెప్పుడూ…

చాయ్‌ ‌బిస్కెట్‌

తొలి కోడి కూతతో లేచి గరం గరం చాయ్‌ ‌కై ఆరాటం పాచి ముఖంతో సేవించే అమృత దారిని బెడ్‌ ‌చాయ్‌……. ‌చాయ్‌ ‌బిస్కెట్‌ ‌కై పిల్లలు గబ గబ రడి అయి ఖాళీ గ్లాస్‌ ‌తో గీ గీ అంటు అమ్మ చుట్టు తిరుగుతూ వేడి వేడి చాయ్‌ ‌ని ష్‌ ‌ష్‌ ‌ని…

‌శేషాచల కొండకోనల్లో.. పుస్తకావిష్కరణ

‘‘అడుగు జాడలు మాత్రం వదలు అరుదైన జ్ఞాపకాలు మాత్రం అందుకో!’’అనే అరణ్య సూక్తికి అక్షరాలా సరిపడే పుస్తకం ‘‘శేషాచల కొండ కోనల్లో…’’రచయిత, అభ్యుదయవేత్త భూమనే తన పాతికేళ్ళ ప్రకృతి ట్రెక్కింగ్‌ ‌మథనం నుంచి ఉద్భవించినయాత్రారచన సంకలనం శేషాచల కొండ కోనల్లో..’’ అనేపుస్తకం అని సీనియర్‌ ‌జర్నలిస్టు, మ్యాకి సంస్థ వ్యవస్థాపకులు బి.వి.రమణ కొనియాడారు.. తూర్పు కనుమలలో…

ఆత్మావలోకనం..

నన్ను నడిపిస్తూ ఆశీర్వదిస్తున్న కవిత్వమా నీకు దాసోహం అని అవ్యాజమైన తన కవిత్వాను బంధాన్ని ప్రవహించే కాలం కవిత్వంలో ప్రఖ్యాత కవి పానుగంటి రామ మూర్తి ప్రకటించారు. 2016లో రామమూర్తి తన మొదటి సంపుటి మనిషై పుట్టాలని వెలువరించారు. 46 కవితలతో వెలువరించిన రెండవ సంపుటి ప్రవహించే కాలం లోని కవితలు భావ స్పోరకంగా పరిమళించాయి.…