‘‘అడుగు జాడలు మాత్రం వదలు అరుదైన జ్ఞాపకాలు మాత్రం అందుకో!’’అనే అరణ్య సూక్తికి అక్షరాలా సరిపడే పుస్తకం ‘‘శేషాచల కొండ కోనల్లో…’’రచయిత, అభ్యుదయవేత్త భూమనే తన పాతికేళ్ళ ప్రకృతి ట్రెక్కింగ్ మథనం నుంచి ఉద్భవించినయాత్రారచన సంకలనం శేషాచల కొండ కోనల్లో..’’ అనేపుస్తకం అని సీనియర్ జర్నలిస్టు, మ్యాకి సంస్థ వ్యవస్థాపకులు బి.వి.రమణ కొనియాడారు..
తూర్పు కనుమలలో భాగమైన తిరుమల, ఇతర శేషాచల అరణ్య ప్రదేశాల్లో తన ట్రెక్కింగ్ కార్యక్రమాలను 60కి పైగా శీర్షికల కింద భూమన్ వర్గీకరించి ఆకట్టుకునే ఛాయా చిత్రాలతో కనులకింపుగా రూపొందించారు. పుస్తకంలో అమెరికా, కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో లలో జరిపిన ట్రెక్కింగ్ అనుభావాలను జోడించడం విశేషం. 75 ఏండ్ల వయస్సులో ఇప్పటికీ కొండకోనల్లో అడవులు, జలపాతాల విహారం చేయడానికి ట్రెక్కింగ్ కారణం అని రచయిత వివరించారు.
తిరుపతి కపిల తీర్థం సమీపంలోని నగరవనంలో ఆదివారం ఉదయం జరిగిన ఈ పుస్తక సమీక్ష కార్యక్రమంలో పలువురు ప్రకృతి ప్రియులు, ట్రెక్కర్లు పాల్గొన్నారు.గతవారం ప్రతిష్టాత్మక ఆర్థిక మండలి శ్రీసిటీలో సైతం తొలి పుస్తక ఆవిష్కరణ జరిగింది. నగరవనంలో ప్రకృతి పరిసరాల నేపథ్యంలో జరిగింది రెండోది. శేషాచలం అరణ్య సౌందర్యాన్ని, రమణీయ ప్రకృతి అందాలను వందలాది ఫోటోల రూపంలో పదుల కొద్దీ వ్యాసాల ఆకృతిలో అందిం చిన ఈ పుస్తకం అడవుల్లో ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళకి మార్గదర్శి…ఈ సందర్భంగా పుస్తక ప్రచురణకు సహాయపడిన ట్రెక్‌సీనూ, పుష్యమిత్ర తదితరులను రచ యిత సభ కులను పరిచ యం చేసి అభినందించారు. తొలుత శ్రీసిటీ పిఆర్‌వో, సీని యర్ జర్నలిస్టు రామ చం ద్రారెడ్డి సమావేశం ప్రాధా న్యతను వివరించగా సమా వేశంలో చివర్లో రచయిత భూమన్‌ను పలువురు ట్రెక్క ర్లు అభినం దించారు.
– ప్రజాతంత్ర డెస్క్