తెలిసుండాలి
ఎక్కడ మృదుత్వంతో మసలుకోవాలో
ఎక్కడ కాఠిన్యాన్ని ప్రదర్శించాలో
ఎక్కడ సంయమనం పాటించాలో
నడవడికే భవితను నిర్ణయించే పరీక్ష
కాలమే తీర్పునిచ్చే న్యాయమూర్తి
ప్రవర్తన సరిగా లేదని
సూచనొస్తుంది ఏదోనాడు
అంతరాత్మ నుండో
ఇతరుల నుండో
పరివర్తన చెందాలి మనసు
కీటకాలు రూపవిక్రియనొంది అందంగా మారినట్టు
ఆకాశం నల్లటి మేఘాల్ని దులిపేసుకొని తెల్లగా మెరిసినట్టు
కాదని, లేదని
నేనే సరియని
మొండిగా దూసుకుపోతానంటే
ఎప్పటికో ఒకప్పటికైనా
రెక్కలు తెగిన పక్షివై కూలబడడం ఖాయం
– కార్తీక రాజు
హనుమకొండ, 8977336447