Category సాహిత్యం-శోభ

సంఘర్షణా రూపాలు

-ఏటూరి నాగేంద్రరావు ఎక్కడో పట్టు జారిపోతుంది వెలుగును ఊహించుకొనే పరిస్థితుల్లో  మార్పు కనిపిస్తోంది ఒకరిశోకం మరొకరిని కదిలించటంలేదు కాలం కరాళ నృత్యం చేస్తూనే వుంది ప్రతివాడు స్పర్శను మరిచిపోయి సుదీర్ఘ మౌనాన్ని కరిగిస్తూనే వున్నాడు మనలోని శక్తి మనల్ని అజ్ఞాన తిమిరాంధకారంలోనికి నెట్టేసి కడుపులో అడ్డం తిరిగిన బిడ్డ రూపాన్ని ప్రదర్శిస్తోంది నిశ్శబ్దంగా నీలో చొచ్చుకుపోయిన…

వేగుంట రాఉడు పాడిన చలిగీతం

చిడతలు ఊడిన రెక్కలకిటికీ తెరిచిపెట్టవద్దని ఒహటే మొత్తుకోలు! వడగాలిలా సుడిగాలిలా ఆ వేళ చలిగాలి రివ్వున వీయడంతో కవిగారి కవోష్ణ హృదయంలో చేతులు కొంగర్లుపోవడం, పై పెదవికి కిందిపెదవికి పోట్లాట మొదలయినా అదేదో వినోదప్రదర్శనలా ఆయనగారి స్వదేహమే పులకరించిపోతూ తిలకించడం! కవిగారికి ఇప్పటివరకు తన హృదయమనే ఎయిర్ కండిషన్డ్ గదిలో వెచ్చగ మునగదీసుకుని మూడంకె వేసి…

తెలంగాణ పట్టెడ కోయ సాహిత్యం

పెళ్ళికోసం ఇంటిని నాలుగుగదులుగా విభాగం చేస్తారు. అనగొంది (వూజగది) పెల్ గొంది (పెళ్లిగది) వంటగది మరియు అరుగు. అనగొందిలోకి ఇంటి ఆడపడుచులను అనుమతించరు. వూర్తిగా నిషేదం అంటారు వరలక్ష్మి. కుంజ వరలక్ష్మి సాంస్కృతిక పరిశోధకురాలు. ‘తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన కళాకారులు డాక్యుమెంటేషన్’ ప్రాజెక్టు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో ప్రాజెక్ట్ ఫెలోగా…

సొంపు

‘ఎంత సౌందర్యం?’ రెప్పలార్పకుండా తెరిచిన నోరు ముయ్యకుండా అంది మగపురుగు. ‘నన్ను పొగడడమే నీకు విధిలాగుంది’ రెప్పల్తెరవకుండా ఆవలింత తీస్తూ అంది ఆడపురుగు. ‘నిన్ను కాదు’ మాటలు రానట్టు తన్మయంతో చూపు తిప్పకుండా అంది మగపురుగు. ఆ మాటకు వులిక్కిపడి కళ్ళుతెరచి చూస్తూ తనూ రెప్పలు కదపకుండా అలానే వుండిపోయింది ఆడపురుగు. రంగురంగుల పిట్ట వొకటి…

అగ్ని పురుగుల జుగల్‌ ‌బందీ

పదం దేహం పద రంగ ప్రదర్శనం రంగనాథ దర్శనం దిగి పోతున్నాను ధరిత్రి నుండి జనాబ్‌ అబ్దుల్‌ ‌సమద్‌ఖాన్‌ ‌జుగ్ను హోటల్‌ ఇద్దరూ దిగిపోయినాక వుపసంహరించుకుంటున్నాను పదాన్నీ ప్రదర్శననీ కాలమొక లైలాండ్‌ ‌లారీ ఈ సెకండు ఎవడి వంతో నాకు తెలుసు పోతులూరికి తెలుసు ఓషో, అమాయకుడు ఏమీ నేర్చుకోనక్కర్లేదన్నాడు అప్రమత్తంగా అభద్రంగా ప్రమాదకరంగా బ్రతకడం…

పండగలు

‘‘మేడే అంటే ఏమిటి తాతయ్యా?’’ అడుగుతున్నాడు చిన్న అబ్బాయి తాతయ్య తిరిగి అడిగాడు అబ్బాయిని ‘‘శ్రీరామ నవమి అంటే ఏమిటి?’’ ‘‘హిందువుల పండుగ’’ ‘‘రంజాన్‌ అంటే’’ ‘‘ముస్లిముల పండుగ’’ ‘‘క్రిష్టమస్‌ అంటే’’ ‘‘క్రైస్తవుల పండుగ’’ ‘‘అలాగే మేడే అంటే కమ్యూనిష్టుల పండుగ’’ చెపుతూ పగలబడి నవ్వినవ్వి కళ్లు తుడుచుకున్నాడు తాతయ్య. తాతయ్య కళ్లల్లో నీళ్లెందుకొచ్చాయో అర్ధం…

‘పీతి’పొట్ట

సూప్‌లూ సలాడ్‌లతో రోజు మొదలైంది పప్పలు తిన్నాడు పప్పులూ తిన్నాడు పానకాలు తాగాడు పాయసాలూ తాగాడు పాలు తాగాడు పళ్ళ రసాలూ తాగాడు బూరెలు తిన్నాడు గారెలూ తిన్నాడు పదహారు పచ్చళ్ళు యిరవైయ్యారు యిగురు కూరలూ తిన్నాడు ముప్పైయ్యారు కాయగూరలు అరవైయ్యారు ఆకుకూరలూ తిన్నాడు రకరకాల పొడులు వేసుకున్నాడు జారుగా నెయ్యినీ కలుపుకున్నాడు డ్రై ఫ్రూట్సే…

ఒక ప్రేమికుడు

ఏ గుట్టకు ఏ పుట్టకు ఏ చెట్టుకు ఆపదొచ్చినా అతనే పెద్దకొడుకై ఆగ్రహపు జెండా కర్రయి నిలిచినోడు హక్కుల గొంతుకలకు నిర్బంధపు సంకేళ్ళు బిగిసినప్పుడు నిరసన గళమై నినదించినోడు కవితల కోకిలను పంజరంలో బంధిస్తే నాలుగు బాటల కూడలిలో నిరసన పదమై బిగించిన పిడికిలయి కదం తొక్కినోడు అక్రమార్కులపై అవినీతి పరులపై జారుడుబండలెక్కిన దిగజారుడు విలువలపై…

ఉత్తర తెలంగాణలో రగిలిన నిప్పురవ్వలు

సింగరేణి కార్మికచరిత్ర, యాంత్రీకరణ విధానాలతో, సింగరేణి కార్మికుల జీవితాలు మారుతున్నక్రమంలో బొగ్గురవ్వలు ఇచ్చే ప్రేరణ విప్లవ కార్మికోద్యమంతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుస్తుంది. బొగ్గురవ్వలు కథకాదు, నవలకాదు. జీవితానుభవాల సమాహారం. సింగరేణి బొగ్గుగనుల్లో కార్మికుడిగా చేరి నాయకుడుగా మారిన పరిణామక్రమం. విప్లవోద్యమంతో విడదీయలేని బంధాన్ని పెనవేసుకున్న జీవనమార్గం. నిర్మొహమాటంగా, చూసింది చూసినట్లు, తన అనుభవాలన్నిటి అక్షరరూపం. సింగరేణి…