Category సాహిత్యం-శోభ

విలువల సేద్యం

ఈ నాటకాల జగతిలో వీళ్లంతా మహానటులే… నటనకే నడకలు నేర్పగల నవీన నటపితామహులే జీవితమంతా నటిస్తూ నటనలోనే జీవించగల అపూర్వ సహజనటులే భువన వేదిక మీద చిత్ర విచిత్ర పాత్రలను అవలీలగా పోషించగల అద్భుత నటసంపన్నులే మదిలో విషం ఒంపి నవరసాలు పండించగల విఖ్యాత నటవిభూషణులే నటించడం వీరి నైజం నమ్మించడం వీరి ఇజం ఇంతటి…

హెచ్చరిక

నీ నిర్లక్ష్యం నీ ప్రాణాన్ని హరించ వచ్చు నీకుటుంబాన్ని అనాదులుగా మార్చే వచ్చు జాగ్రత్త పడటం తప్పు కాదు కుక్క కాటు ప్రాణం మీదకు తేవచ్చు వ్యాక్సిన్‌ ‌చేయని పెంపుడు కుక్క కరిస్తే రేబిస్‌ ‌వ్యాధి చోకుతుంది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోవచ్చు మనుషులు నుంచి జంతువులకు జంతువులు నుంచి మనుషులకు వచ్చే వ్యాధులు తెలుసుకో…

సాహితీ బంధనాలు

కన్నీళ్లొస్తున్నాయి అవును… నీవు విన్నది నిజమే. ఆంక్షల బురదలో కూరుకుపోయిన స్వేచ్చా సాహిత్యపు ప్రస్తుత స్థితి చూస్తోంటే దుఃఖం పెల్లుబుకుతోంది. కెరటమై పరిగెత్తాలన్న దాని కోరికను అడ్డంకుల బండలు గుద్దుకొంటుంటే దాని చుట్టూ కళ్ళుచించుకున్నా కానరాని చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. ఊహించనే లేదుగా దశాబ్దాల ఘనచరితలో ఇంతటి నిశ్శబ్ద భీతి. దారులు చెరిపేస్తూ విరబోసుకున్న నియంతృత్వపు…

అల్లూరికి లాల్‌ ‌సలాం

‘ఆ చూపు మహోజ్వలితం ఆ రూపు దివ్య ప్రకాశితం ఆ గళం సింహా గర్జనం ఆ పిడికిలి విప్లవ సంకేతం ఆ ఆవేశం ఉత్తుంగ తరంగం ఆ అడుగు అభ్యుదయ పథం ఆ సాహసం అద్వితీయం ఆ సంకల్పం అజరామరం అతడే అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు దేశమాత స్వేచ్ఛ కోసం సాయుధ పోరు నడిపినవాడు…

కమ్మని ఆశ

ఎంత బాగుండేవి ఆ రోజులు? పాలమీగడ లాంటి మనసున్న మనుషుల మృదు మధుర భాషణలు విరిజల్లులా నిండుగా రాలుతూ మదిని తాకుతోంటే, మానసవీణ పురివిప్పిన మయూరమై పరవశించేది. మరి నేడో… ఎక్కడున్నాయి మనసును పులకరింపచేసే ఆ ఆత్మీయ పలకరింపులు? మనిషితనం కోల్పోయి, మంచితనం ఆవిరై, కృత్రిమత్వమే అంతటా.. ఎటుచూసినా,ఎక్కడచూసినా కమిలిపోతున్న మృదుత్వమే. ఆశలన్నీ కలువపూలై కనుదోయిలో…

కన్నీటి బొట్టు

గుండె అంతా ఆవిరి అయిపోయిన తరువాత మిగిలిందేమో బయటలోకానికి తను కనబడటానికి ఎంత తటపటాయించిందో! బండరాయిగా మారిన గుండెల్లో అట్టడుగున తన ఉనికే లేనట్లు దాక్కుంది! భావం లేని ఎడారి మనసులో ఎక్కడో కాస్తంత చెమ్మగా మిగిలిపోయింది! పరువుపోతుందని దిగాలుపడింది కానీ తన బరువుకు ఆ గుండే ఆగిపోతుందని గ్రహించలేదనుకుంటా! హాలహలం పోసి మనసు గర్భాన్ని…

అమృత మూర్తులు

పల్లవి: ఆడపిల్లలు అడవి మల్లెలు పుడమితల్లి శిగలో సిరిమల్లెలు ఆడపిల్లలు అడవి మల్లెలు పుడమితల్లి శిగలో సిరిమల్లెలు చరణం:1 అవనికి అందాలే ఆడపిల్లలు అఖిల జగతి అంతా సుమ గంధాలు పుట్టినిల్లు మెట్టినిల్లు మీ కోవెలలు మీ పాదమిడిన చోట దివ్య ధామాలు చరణం:2 ఆత్మీయ  ఆనవాళ్లు ఆడపిల్లలు అవిశ్రాంత శ్రామికులు ఆడపిల్లలు సృష్టికి ఆధారం…

ఒక్క క్షణం

ఎన్నో ఆశల సౌధాలు మరెన్నో నోముల ఫలాలు రెప్పపాటుకాలంలో విలువైన జీవితాన్నిడిచి రాలిపోతున్నాయ్‌ ‌గుండెల్లో తీరనివేధనను మిగిల్చి కనిపించని తీరం చేరువౌవుతుంటే చల్లారని కడుపుమంట నిత్యం రగులుతోంది ఏంటి చదువులు ఎటేపు దాని పయనం మనిషికి మనుగడ లేకుండా చేయ్యడమా ఒత్తిడిని మనసంతా నింపుకుని జ్ఞానమెక్కడ జారిపోతోందోనని నిండైన జీవితాన్ని ఒలకబోసుకుంటున్న భవిష్యత్తు సూర్యులు మానసిక…

పల్లె ముంగిట్లో…

రేపటి అత్యాశల గాలానికి చిక్కుకొని బలవంతంగా రూపురేఖలు మార్చుకుంటూ విలవిల్లాడుతోంది మావూరు… వేరునుంచి విడిపోయిన మొక్కలా దాహానికి దూరమైపోయిన నీటిచుక్కలా బావురుమంటోంది చెలిమిచెలమల్ని కోల్పోయిన నా హృదయపుటేరు… కాంక్రీటు గోడల నీడల్లో మావూరు వాడలన్నీ తమ జాడల్ని పోగొట్టుకుంటున్నాయి… నాకు పురాజ్ఞాపకాలుగా మీగిలిపోతున్న నా పల్లె అందాలనూ, అనుబంధాలనూ ఆత్మభూతద్దంలోంచి అదేపనిగా వెతుక్కుంటున్నాను… అప్పుడు మా…