Category జాతీయం

బాంబు దాడి నిందితులను వొదలబోం

– భూటాన్‌ ‌పర్యటనలో ప్రధాని మోదీ హెచ్చరిక – బాధాత‌ప్త‌ హృదయంతో ఇక్కడికి వొచ్చానని వెల్లడి న్యూదిల్లీ, నవంబర్‌ 11: ‌దిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు దాడికి పాల్పడిన నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వొదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. దేశంలోని పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశాయని.. దాడికి గల కారణాలను…

బీహార్‌లో రేపు రెండో దశ ఎన్నికలు

– 122 స్థానాలకు పోలింగ్‌ పాట్నా, నవంబర్‌ 10: ‌బీహార్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొదటి దశలో 121 స్థానాల్లో పోలింగ్‌ ‌జరుగగా.. మిగిలిన 122 స్థానాలకు రెండో దశలో పోలింగ్‌ ‌నిర్వహించనున్నారు. ఈ దశలో మొత్తం 1302 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. సుమారుగా 4 కోట్ల…

డీప్‌ఫేక్‌ ‌సమస్యలపై సిజెఐ ఆందోళన

– అప్రమత్తంగా ఉండాలని న్యాయవాదులకు హెచ్చరిక న్యూదిల్లీ, నవంబర్‌ 10: ఆధునిక సాంకేతిక యుగంలో చాలా మంది డీప్‌ఫేక్‌ ‌సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాయిస్‌ ‌క్లోనింగ్‌, ‌డీప్‌ఫేక్‌, ‌చాట్‌బాట్‌ ‌ఫిషింగ్‌ ‌వంటి టూల్స్, ‌యాప్స్‌ను ఉపయోగించి దీని ద్వారా సైబర్‌ ‌నేరగాళ్లు తేలికగా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ డీప్‌ఫేక్‌ ‌ఫొటోలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌బి.ఆర్‌.…

షట్‌డౌన్‌ నుంచి బయటపడే దశలో అమెరికా

– 40 రోజులపాటు నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు వాషింగ్టన్‌, నవంబర్‌ 10: అమెరికాలో నెలకొన్న ప్రభుత్వ షట్‌డౌన్‌ మేఘాలు వీడిపోనున్నాయి. దీనికి అనుకూలంగా ఆ దేశ సెనెట్‌ ఓటింగ్‌ జరిగింది. కొందరు డెమోక్రాట్లు కూడా అనుకూలంగా ఓటు వేయడంతో 40 రోజులపాటు నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అమెరికా ప్రభుత్వానికి నిధుల విడుదలకు…

సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు

– అందె శ్రీ మృతికి ప్ర‌ధాని సంతాపం న్యూదిల్లీ, న‌వంబ‌ర్ 10: అందె శ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎక్స్ వేదిక‌గా పేర్కొన్నారు. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు , ఆకాంక్షలకు, అకుంఠిత…

నోబెల్‌ శాస్త్రవేత్త జేమ్స్‌ డి వాట్సన్‌ కన్నుమూత

– వృద్దాప్య సమస్యలతో మరణించినట్లు ప్రకటన న్యూయార్క్‌, నవంబర్‌ 8: జీవం ఉనికికి కారణమైన జన్యు పదార్థం డీఎన్‌ఏ నిర్మాణాన్ని కనుగొన్న అమెరికన్‌ శాస్త్రవేత్త జేమ్స్‌ డీ వాట్సన్‌ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వృద్దాప్య సంబంధిత సమస్యలతో 97ఏళ్ల వయసులో కన్నుమూశారు. న్యూయార్క్‌లోని కోల్డ్‌ స్ప్రింగ్‌ హార్బర్‌ లేబొరేటరీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మెలికలు తిరిగిన…

గవర్నర్‌ ఎన్నికల్లో వివేక్‌ రామస్వామి

– సంపూర్ణ మద్దతు ప్రకటించిన ట్రంప్‌ న్యూయార్క్‌, నవంబర్‌ 8: మూడు అమెరికా రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తులు గెలుపొందిన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అప్రమత్తమయ్యారు. ఒహాయో గవర్నర్‌ ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్‌ నేత, భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామికి తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన…

వందేమాతరంతో ఆత్మవిశ్వాసం

– అది భవిష్యత్తుకు సరికొత్త భరోసా – వందేమాతరం 150వ స్మారకోత్సవంలో ప్రధాని మోదీ దిల్లీ, నవంబరు 7: వందేమాతరం శబ్దం విన్నంతనే మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని ప్రధాని మోదీ అన్నారు. భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందన్నారు. దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ ‌స్టేడియంలో శుక్రవారం జ‌రిగిన వందేమాతరం 150వ స్మారకోత్సవంలో ఆయ‌న‌ మాట్లాడారు. స్వాతంత్య్ర ఉద్యమంలో…

దిల్లీ ఎయిర్‌ పోర్టులో సాంకేతిక సమస్య

– విమానాల రాకపోకలకు అంతరాయం న్యూదిల్లీ, నవంబర్‌ 7: దేశ రాజధాని దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. ఎయిర్‌పోర్టులోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థలో సాంకేతికలోపం తలెత్తడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీని కారణంగా దాదాపు 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు…