Category జాతీయం

విశాఖ నుంచే మళ్లీ పోటీ చేస్తా

ఏదైనా పార్టీ విధానం నచ్చితే ఆలోచిస్తా లేదంటే ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగుతా మాజీ జెడి లక్ష్మీనారాయణ వెల్లడి విశాఖపట్నం, ఫిబ్రవరి 21 : వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ  పోటీ చేయనున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. మనదేశంలో ఇండిపెండెంట్‌గా పోటీచేసే వెసలుబాటు ఉందన్నారు. ఈమేరకు ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు. మంగళవారం…

వర్చువల్‌గా భారత్‌-‌సింగపూర్‌ ‌మధ్య యుపిఐ-పేనౌ లింకేజీ

‌హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 21 : యుపిఐ-పేనౌ లింకేజి అనేది దేశాంతర లావాదేవీలను సులభతరంగా, తక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా, వాస్తవ కాల ప్రాతిపదిక కలిగినవిగా మార్చివేయనుంది. భారతదేశానికి, సింగపూర్‌కు మధ్య ఒకటో క్రాస్‌-‌బార్డర్‌ ‌లావాదేవీని నిర్వహించిన ఆర్‌బిఐ గవర్నరు, ఎమ్‌ఎఎస్‌ ఎమ్‌డి, భారతదేశానికి చెందిన యునైటెడ్‌ ‌పేమెంట్స్ ఇం‌టర్‌ ‌ఫేస్‌ (‌యుపిఐ)కి, సింగపూర్‌కు చెందిన పేనౌకు…

విద్యుత్‌ ‌కంచె తగిలి పులి మృతి

వండుకు తిన్న దుండగులు ఒంగోలు, ఫిబ్రవరి 20 : విద్యుత్‌ ‌కంచెకు తగిలి చనిపోయిన పులిని కొందరు గుట్టుచప్పుడు కాకుండా వండుకు తిన్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 10న ఎర్రగొండపాలెం ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో…

‌ప్రతి ఒక్కరికీ ఆధార్‌ ‌తప్పనిసరి… కేంద్రం కీలక నిర్ణయం

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 20 : ప్రతీ ఒక్క పథకానికి ఇదే ఆధారం. ఈ కార్డు లేనిదే ఏ సంక్షేమ పథకాలు దరి చేరే విధంగా ఉండవు. భారత్‌ ‌లో ప్రతి ఒక్కరికీ ఆధార్‌ ‌కార్డు ను కేంద్రం తప్పనిసరి చేసింది. దీనిలో భాగంగానే యూఐడీఏఐ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆధార్‌ ‌కేంద్రాల ద్వారా సేవలను…

పూచీకత్తు ప్రమాణాలు సక్రమంగా పాటిస్తే రుణాలు

అదానీ గ్రూప్‌నకు రుణాలు ఇస్తూనే ఉంటాం బ్యాంక్‌ ఆఫ్‌ ‌బరోడా చీఫ్‌ ‌సంజీవ్‌ ‌చద్దా కీలక వ్యాఖ్యలు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 20 : అదానీ గ్రూప్‌నకు రుణాలు కొనసాగుతాయంటూ బ్యాంక్‌ ఆఫ్‌ ‌బరోడా చీఫ్‌ ‌వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ ‌బరోడా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌సంజీవ్‌ ‌చద్దా…

కన్నడ సినీ దర్శకుడు ఎస్‌కే భగవాన్‌ ‌మృతి

బెంగళూరు, ఫిబ్రవరి 20 : కన్నడ సినీ దర్శకుడు ఎస్‌కే భగవాన్‌ ‌కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం 6 గంటలకు జయదేవ ఆసుపత్రిలో కన్నుమూశారు. భగవాన్‌ ‌మృతి పట్ల కర్ణాటక సీఎం బసవరాజ్‌ ‌బొమ్మై సంతాపం తెలిపారు.  భగవాన్‌ ‌మరణవార్త విని చాలా బాధపడ్డానన్నారు. ఆయన కుటుంబానికి ఈ…

మా దేశం దివాలా తీసేసింది

సియోల్‌కోట్‌, ‌ఫిబ్రవరి 20 : ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌ ‌త్వరలోనే దివాలా తీయనుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే తమ దేశం దివాలా తీసేసిందంటూ ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దివాలా తీసిన పాకిస్థాన్‌లోనే మనమంతా బతుకుతున్నామని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి దేశ రాజకీయ,…

మైనింగ్‌ ‌కుంభకోణంపై ఈడీ మరోసారి కొరడా

ఛత్తీస్‌గఢ్‌, ‌ఫిబ్రవరి 20 : ఛత్తీస్‌గఢ్‌ ‌బొగ్గు అక్రమ మైనింగ్‌ ‌కుంభకోణం కేసు లో ఈడీ మరోసారి కొరడా ఝులిపించింది. దర్యాప్తులో భాగంగా ఈడీ  అధికారులు సోమవారం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌  ‌నేతల నివాసాలతోపాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. రాజధాని రాయ్‌పుర్‌ ‌లో ఫిబ్రవరి 24-26 వరకు నిర్వహించనున్న కాంగ్రెస్‌ ‌పార్టీ ప్లీనరీ సమావేశాలకు…

జమ్ము కాశ్మీర్‌ ‌రాంబన్‌లో కుంగుతున్న భూమి

రాంబన్‌, ‌ఫిబ్రవరి 20 : ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో భూమి కుంగి పోతున్నది. అసోం, మణిపూర్‌ ఇలా ఈశాన్య, ఉత్తర భారత దేశంలో అక్కడక్కడా చిన్న భూకంపాలు, ప్రకంపనలు వొస్తున్నాయి. తాజాగా జమ్ముకాశ్మీర్‌లోని రాంబన్‌ ‌జిల్లాలో భూమి కుంగిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది?  పంచాయత్‌లోని దిక్సర్‌ ‌ప్రాంతంలో ఆదివారం ఉదయం నుంచి భూమి కుంగడం మొదలైంది.…